ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​PM Modi | అమరావతి నగరమే కాదు.. ఒక శక్తి : మోదీ

    PM Modi | అమరావతి నగరమే కాదు.. ఒక శక్తి : మోదీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | అమరావతి(Amaravati) నగరం మాత్రమే కాదని.. ఒక శక్తి అని.. ఆంధ్రప్రదేశ్​ను అధునాతన రాష్ట్రంగా మార్చే శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. అమరావతి స్వర్ణాంధ్ర ప్రదేశ్​ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. అమరావతి పున:ప్రారంభోత్సవ పనుల్లో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ‘మీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ తెలుగు ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి స్వప్నం(Amaravati Dream) సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​(Deputy CM Pawan Kalyan), ఆంధ్రప్రదేశ్​ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్​ వికసిత్​ ఆంధ్రప్రదేశ్​ కోసం కలలుగన్నారని తెలిపారు. వికసిత్​ భారత్​లో భాగంగా ఆంధ్రప్రదేశ్​ అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇది మనమే చేయాలన్నారు.

    PM Modi | టెక్నాలజీ చంద్రబాబుని చూసి నేర్చుకున్నా..

    నేను ఈ సభలో మీకో రహస్యం చెబుతానని మోదీ అన్నారు. గుజరాత్​ ముఖ్యమంత్రి(Gujarat Chief Minister)గా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్​లో ఐటీ(IT) ఏవిధంగా అభివృద్ధి చేశారో తెలుసుకున్నానని తెలిపారు. నేను ఆ సమయంలో ఆయన నుంచి నేర్చుకున్నానని పేర్కొన్నారు.

    PM Modi | రికార్డు స్థాయి స్పీడ్​లో పనుల పూర్తికి సహకారం

    రికార్డు స్థాయి స్పీడ్​లో పనులను పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని ప్రధాని మోదీ(Prime Minister Modi) తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాలను కల్పించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. హైవే(High Way)ల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అమృత్​ భారత్(Amruth Bharath)​ కింద అనేక రైల్వేస్టేషన్లను ఆధునీకరించామని చెప్పారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...