More
    Homeజిల్లాలునిజామాబాద్​CPM Nizamabad | తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

    CPM Nizamabad | తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | తెలంగాణ సాయిధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ముబారక్ నగర్​లోని (Mubaraknagar) బీడీ కంపెనీలో మంగళవారం తెలంగాణ రైతాంగ పోరాట విషయాలను వివరించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదన్నారు. నిజాం నవాబుకు (Nizam Nawab) తాబేదారులుగా ఉన్న దొరలు, భూస్వాములు, పటేల్ పట్వారీలు, జాగీర్దారులు, జమీందార్లు పేదలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ దౌర్జన్యం చేశారన్నారు.

    ప్రజల్లో తిరుగుబాటు వచ్చి కమ్యూనిస్టుల నాయకత్వంలో సంఘాలను ఏర్పాటు చేసుకొని కులమతాలకు అతీతంగా దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. మూడువేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేశారన్నారు.

    పోరాటంలో 2,500 మంది పేదలు, కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇంతటి చరిత్ర కమ్యూనిస్టులకు ఉంటే దాన్ని వక్రీకరణ చేస్తున్న బీజేపీ విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, నాయకులు సాయిలు, మోహన్, ఖాదర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Nizamabad | భారీగా అల్ప్రాజోలం పట్టివేత

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ నగర శివారులో నార్కోటిక్ బృందం అధికారులు మంగళవారం దాడులు...

    Bathukamma Young Filmmakers’ Challenge | యువ కంటెంట్ క్రియేటర్లకు ప‌ట్టం.. బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025 పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలు!

    అక్షరటుడే, హైదరాబాద్: Bathukamma Young Filmmakers’ Challenge | తెలంగాణ‌లోని యువ కంటెంట్ క్రియేటర్లకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్...

    IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్​ల బదిలీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IAS Transfers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS)​లను ప్రభుత్వం ట్రాన్స్​ఫర్​ చేసింది. నలుగురు...