అక్షరటుడే, గాంధారి: Collector Kamareddy | మండల కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) మంగళవారం పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శిథిలమైన ఆర్అండ్బీ రోడ్లు, వంతెనలు, కల్వర్టులను ఆయన పరిశీలించారు.
గుర్జాల్ తండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. తర్వాత విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించి వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఐదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ నోట్పుస్తకాలను పంపిణీ చేశారు.
అంతేకాకుండా స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీపీవో మురళి (DPO Murali), డీఎల్పీవో సురేందర్, ఎంపీడీవో రాజేశ్వర్, తహశీల్దార్ రేణుకా చౌహన్, ఎంపీవో లక్ష్మీనారాయణ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.