More
    HomeతెలంగాణACB Raids | ఏడీఈ ఆస్తులు మాములుగా లేవుగా.. రూ.2 కోట్ల నగదు సీజ్​ చేసిన...

    ACB Raids | ఏడీఈ ఆస్తులు మాములుగా లేవుగా.. రూ.2 కోట్ల నగదు సీజ్​ చేసిన ఏసీబీ అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | విద్యుత్​ శాఖ ఏడీఈ అంబేడ్కర్ (ADE Ambedkar)​ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు.

    హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని మణికొండలో అంబేడ్కర్​ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన ప్రతి పనికి లంచం డిమాండ్​ చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. నగరంలోని కీలక ప్రాంతం కావడంతో బాగానే అక్రమాస్తులు కూడబెట్టాడు. అయితే అంబేడ్కర్​ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని ఏసీబీ అధికారులు ఫిర్యాదులు అందాయి. దీంతో మంగళవారం ఉదయం నుంచి అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు చేపడుతున్నారు. ఏడీఈ బంధువులతో పాటు బినామీల ఇళ్లలో సైతం సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

    ACB Raids | బినామీ ఇంట్లో రూ.రెండు కోట్లు

    ఏడీఈ అంబేడ్కర్ బినామీ సతీష్ ఇంట్లో భారీగా నగదును ఏసీబీ (ACB) అధికారులు పట్టుకున్నారు. రూ. 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. అలాగే మిగతా వారి ఇళ్లలో దొరికిన నగదు, బంగారు ఆభరణాల వివరాలను అధికారులు లెక్కిస్తున్నారు. ఏడీకీకి మొత్తం రూ. 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. దాడుల్లో భారీగా ఆస్తులు, వ్యవసాయ భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్​, గచ్చిబౌలితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో 15 ఏసీబీ బృందాలు దాడులు చేపడుతున్నాయి. అధికారులు ఆయన అక్రమాస్తుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. త్వరలో వివరాలు వెల్లడించనున్నారు.

    More like this

    Telangana Government | సర్కారుపై సమరభేరీ.. నిన్న కళాశాలలు, నేడు ఆస్పత్రులు, రేషన్ డీలర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Government | రాష్ట్రంలో ఆందోళనల పర్వం సాగుతోంది. సర్కారుపై సమరభేరీ మోగుతోంది. ప్రభుత్వ తీరుకు...

    MLA PA | పీఏలదే పెత్తనం.. అధికారులకు హుకుం జారీ చేసేది వారే!

    అక్షరటుడే, కామారెడ్డి : MLA PA | ఉమ్మడి జిల్లాలో ప్రజలు పలువురు ఎమ్మెల్యేలను నేరుగా కలవలేని పరిస్థితి...

    IPO | రేపటినుంచి మరో ఐపీవో.. జీఎంపీ ఎంతంటే..?

    అక్షరటుడే, వెబ్​డెస్క్: IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి మరో మెయిన్‌బోర్డ్‌ (Main board) ఐపీవో వస్తోంది. వీఎంఎస్‌...