అక్షరటుడే, ఎల్లారెడ్డి: Job Mela | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయ అధికారి రజనీకిరణ్ (Officer Rajini Kiran) మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
Job Mela | హైదరాబాద్‌లోని హెటెరో కంపెనీ ఆధ్వర్యంలో..
హైదరాబాద్‌లోని (Hyderabad) ప్రముఖ కంపెనీ హెటెరో కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. కంపెనీలో 40 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు, 100 జూనియర్ కెమిస్ట్/ట్రెయినీ(ప్రొడెక్షన్) పోస్ట్లు, 60 జూనియర్ ఇంజినీర్/ట్రెయినీ(ఇంజినీరింగ్/ట్రెయినీ) ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి పేర్కొన్నారు.
Job Mela | అర్హతలివే..
జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలకు (junior officer jobs) ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (ఆర్గానిక్,అనలిటికల్, ఇనార్గానిక్) చేసి ఉండాలని వారికి ఏడాది 2.8లక్షల ప్యాకేజీ ఉందన్నారు. అలాగే జూనియర్ కెమిస్ట్/ట్రెయినీ ఉద్యోగానికి (పురుషులు) గాను బీఎస్సీ కెమిస్ట్రీ లేదా బీఏ, బీకాం చేసి ఉండాలని.. వారికి ఏడాదికి రూ. 2.6లక్షల ప్యాకేజీ ఉంటుందన్నారు. జూనియర్ ఇంజినీర్/ట్రెయినీ (పురుషులు) ఉద్యోగాలకు డిప్లొమా ఇన్ మెకానికల్/ కెమికల్ ఇంజినీరింగ్ అర్హత ఉండాలని.. వారికి ఏడాదికి రూ.2లక్షల ప్యాకేజీ ఉందని తెలిపారు.
అభ్యర్థులు 18 నుంచి 25 ఏళ్ల వరకు ఉన్న యువతీయువకులు అర్హులని.. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు రెండు సెట్ల విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫొటోలతో కామారెడ్డి కలెక్టరేట్లోని (Kamareddy Collectorate) ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 90598 88389, 76719 74009లలో సంప్రదించాలని సూచించారు.