అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | ఎల్లారెడ్డి మండలంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనలో (Pradhan Mantri Awas Yojana scheme) భాగంగా లబ్ధిదారుల సర్వే నిర్వహిస్తున్నారు. పథకానికి అర్హత సాధించిన గ్రామీణ కుటుంబాలకు గృహనిర్మాణానికి (house construction) సాయం చేస్తామని ఎంపీడీవో ప్రకాశ్ పేర్కొన్నారు.
మండలంలోని సోమార్పేట్ గ్రామంలో (Somarpet village) మంగళవారం లబ్ధిదారుల సర్వే నిర్వహించారు. గ్రామీణ లబ్ధిదారులకు కొత్త ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అయితే పట్టణ ప్రాంతాలకు 2022లో ముగిసిన పథకం గడువును డిసెంబర్ 2025 వరకు పొడిగించారు. ఇళ్లను పూర్తి చేయడానికి, అవగాహన పెంచడానికి, పథకం అమలును వేగవంతం చేయడానికి అంగీకార్–2025 పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.