అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ ప్రాథమిక సహకార సంఘం (Birkur Primary Cooperative Society) ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా ఇంగు రాములు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సహకార సంఘం కార్యదర్శి విఠల్ ఆయనకు ఉత్తర్వుల కాపీ అందజేసి బాధ్యతలు అప్పగించారు. నూతన ఛైర్మన్‌కు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సహకార సంఘం సిబ్బంది అభినందించారు.
అనంతరం ఇంగు రాములు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy), పోచారం భాస్కర్‌రెడ్డి, రైతుల సహకారంతో సహకార సంఘాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ యామ రాములు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ రఘు, మాజీ ఎంపీటీసీ సందీప్, శశికాంత్, అంబలి బసవరాజ్, గంగారాం తదితరులు పాల్గొన్నారు.