More
    Homeక్రీడలుED Notice | యువ‌రాజ్‌, ఉతప్ప‌కు ఈడీ నోటీసులు విచార‌ణకు రావాల‌ని స‌మ‌న్లు జారీ

    ED Notice | యువ‌రాజ్‌, ఉతప్ప‌కు ఈడీ నోటీసులు విచార‌ణకు రావాల‌ని స‌మ‌న్లు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ED Notice | ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్ కేసు ద‌ర్యాప్తులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(Enforcement Directorate) దూకుడు పెంచింది. ఇప్ప‌టికే భార‌త మాజీ క్రికెట‌ర్లు శిఖ‌ర్‌, సురేశ్ రైనాను విచారించిన ఈడీ.. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు మాజీ క్రికెట‌ర్ల‌కు నోటీసులు జారీ చేసింది.

    యువ‌రాజ్‌సింగ్‌(Yuvraj Singh), రాబిన్ ఉతప్ప‌ల‌ను విచార‌ణ‌కు రావాల‌ని మంళ‌వారం నోటీసులు పంపించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల‌కు సంబంధించిన మ‌నీలాండ‌రింగ్ కేసులు ప్ర‌శ్నించ‌డానికి స‌మన్లు జారీ చేసింది. సెప్టెంబ‌ర్ 22న రాబిన్ ఉత‌ప్ప(Robin Uthappa)ను సెప్టెంబ‌ర్ 23న యువ‌రాజ్‌ను విచార‌ణ‌కు రావాల‌ని సూచించింది.

     ED Notice | వాంగ్మూలాల సేక‌ర‌ణ‌..

    ప‌లువురు క్రికెట‌ర్లు, సినీ తార‌లు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌(Online Betting App)ల త‌ర‌ఫున ప్ర‌చారం చేశారు. అయితే, ఆన్‌లైన్ బిట్టింగ్ యాప్‌ల మూలంగా ఎంతో మంది డ‌బ్బులు పోగొట్టుకున్నారు. కొంత మంది ఆత్మ‌హ‌త్య కూడా చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నిషేధించింది. మ‌రోవైపు, బెట్టింగ్ యాప్‌ల నేప‌థ్యంలో భారీగా మ‌నీలాండ‌రింగ్(Money Laundering) జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఈడీ రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే ప‌లువురు సినీ, క్రికెట్ ప్ర‌ముఖుల‌ను ప్ర‌శ్నించింది. తాజాగా మ‌రో ఇద్ద‌రికి నోటీసులు జారీ చేసింది.

    More like this

    CPM Nizamabad | తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

    అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | తెలంగాణ సాయిధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి...

    Team India | టీమిండియాకి కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చేశారు.. ఇక నుండి జెర్సీలు ఎలా ఉండ‌నున్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Team India | భారత క్రికెట్ ప్రేమికులకు తాజా అప్‌డేట్! టీమిండియా క్రికెట్ జెర్సీపై ఇకపై...

    Birkur | గుడి డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తా: బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి (Telangana Tirumala Tirupathi) సంబంధించి రూ.25 లక్షలు...