అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Galaxy F17 | సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ అయిన శాంసంగ్.. గెలాక్సీ ఎఫ్ 17(Galaxy F17) పేరుతో కొత్త మోడల్‌ను తీసుకువచ్చింది.
ఆరు జనరేషన్‌ల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్స్, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్(Samsung) అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ఫీచర్ల గురించి తెలుసుకుందామా…
- 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటు, 1100 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ శక్తిని కలిగి ఉంది. IP 54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తోంది.
- ఎక్సీనాస్ 1330 చిప్‌సెట్‌ను అమర్చారు.
- ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 ఆధారంగా పనిచేస్తుంది. ఆరేళ్ల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుతాయి.
- ఫోన్ వెనకభాగంలో 50 ఎంపీ OIS ప్రధాన కెమెరా, 5 ఎంపీ అల్ట్రావైడ్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందువైపు 13 ఎంపీ సెన్సార్ ఉంది.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 25w ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. టైప్ సీ టూ టైప్ సీ యూఎస్‌బీ కేబుల్ అవసరం.
వేరియంట్స్..
వైలెట్ పోప్, నియో బ్లాక్ కలర్లలో రెండు వేరియంట్లలో లభిస్తుంది.
4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,499.
6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,999.
కార్డ్ ఆఫర్స్..
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ(Flipkart SBI) క్రెడిట్ కార్డులతో ఐదు శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.