అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Sarees | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దమవుతోంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రతి ఆడబిడ్డ కొత్త చీర కట్టుకోవాలన్న ఆకాంక్షను గౌరవిస్తూ, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో మహిళకు రెండు చీరలు ఉచితంగా అందించనుంది.
ఒక్కో చీర ధర రూ.800 ఉండగా, మొత్తం రూ.1600 విలువైన వస్త్రాలను అందించబోతున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పంపిణీ సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు జరగనుంది.
Indiramma Sarees | నాసిరకం చీరలపై విమర్శలు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిన చీరల నాణ్యతపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలు వాటిని ఉపయోగించడానికి ఆసక్తి చూపకపోవడం, నాసిరకం రంగు, ఇలా పట్టుకోగానే చిరిగిపోవడం వంటి అంశాలు మీడియా ప్రధానంగా హైలైట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈసారి రేవంత్ సర్కార్ నాణ్యమైన, ఆహ్లాదకరమైన రంగుల్లో ఉన్న చీరలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం ద్వారా 6000 మందికి పైగా చేనేత కార్మికులకు ఉపాధి లభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. చీరల డిజైన్లు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ చీరలు ఎంతో అద్భుతంగా , మన్నికగా ఉంటాయని అంటున్నారు.
ఈసారి ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు అందంగా, మన్నికగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సందర్భంగా తమకు అందే ఈ కానుకను ఎంతో ఆనందంగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది కేవలం ఒక వస్త్ర పంపిణీ మాత్రమే కాక, ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకగా మారుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పండుగకు మరిన్ని రంగులు నింపుతుందనే మాట వినిపిస్తోంది. తెలంగాణ ఆడబిడ్డలకు ఇది నిజమైన ఉత్సవ కానుక అని కొందరు కామెంట్ చేస్తున్నారు.