More
    HomeతెలంగాణRain Alert | నేడు భారీ వర్షాలు పడే ఛాన్స్​.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

    Rain Alert | నేడు భారీ వర్షాలు పడే ఛాన్స్​.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

    రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. బంగళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన  (LPA) ప్రభావంతో గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. మంగళవారం సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉంది.

    Rain Alert | సాయంత్రం తర్వాత..

    రాష్ట్రంలోని మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్​, రంగారెడ్డి, వికారాబాద్​, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయి. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వరుణుడు తన ప్రతాపం చూపనున్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ బాగానే కాస్తుంది. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంది.

    Rain Alert | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్​ (Hyderabad)లో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. సోమవారం సైతం నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. కూకట్​పల్లి, మియాపూర్​, శేరిలింగంపల్లి, మాధాపూర్​, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్​, పటాన్​చెరు, మెహదిపట్నం ఏరియాల్లో వర్షం పడింది. కూకట్​పల్లిలో 37.8 మి.మీ. వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

    Rain Alert | వర్షపాతం వివరాలు

    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం పడింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా మెదక్ (Medak)​ జిల్లా రేగోడ్​లో 125 మి.మీ. వర్షం కురిసింది. పాపన్నపేట మండలం మిన్​పూర్​లో 108, కొల్చారంలో 102, మంచిర్యాల జిల్లా కొండాపూర్​లో 98.8, సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో 95.8, సిద్దిపేట జిల్లా తుక్కాపూర్​లో 89 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.

    More like this

    Job Mela | కామరెడ్డిలో నిరుద్యోగులకు జాబ్​మేళా

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Job Mela | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) నిరుద్యోగ యువతకు ప్రైవేట్​ రంగంలో ఉద్యోగావకాశాలు...

    Private School | ప్రైవేట్​ పాఠశాలలో దారుణం.. విద్యార్థిని తల పగిలేలా కొట్టిన టీచర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private School | ఓపికగా ఉండి విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన కొందరు టీచర్లు (Teachers)...

    Yellareddy mandal | పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారుల సర్వే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | ఎల్లారెడ్డి మండలంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంలో (Pradhan Mantri...