అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cochin Shipyard Jobs | ప్రభుత్వరంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన(Contract basis) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నిషియన్ అప్రెంటిస్‌లను తీసుకోనున్నారు. ఇందుకోసం అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
పోస్టుల వివరాలు : మొత్తం 140.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (Graduate Apprentice): 70, టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 70. (మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్(Civil Engineering), కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, నేవల్ అర్కిటెక్చర్ అండ్ షిప్‌బిల్డింగ్, కమర్షియల్ ప్రాక్టీస్, కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగాలలో అవకాశం కల్పించనున్నారు.
అర్హతలు : ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ(Degree) ఉత్తీర్ఱత సాధించినవారు అర్హులు. ఈ ఏడాది జూలై 20 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.12 వేలు, టెక్నిషియన్‌కు రూ. 10,200.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 25.
అధికారిక వెబ్‌సైట్ : https://cochinshipyard.in లో సంప్రదించగలరు.