More
    Homeఆంధ్రప్రదేశ్​Nellore | పేకాడేందుకు నదిలోకి.. తర్వాత ఏం జరిగిందంటే?

    Nellore | పేకాడేందుకు నదిలోకి.. తర్వాత ఏం జరిగిందంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nellore | పేకాటకు అలవాటు పడిన వారు పోలీసులకు చిక్కకుండా అనేక ప్లాన్​లు వేస్తారు. రహస్యా ప్రాంతాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తారు.

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో చాలా మంది పేకాడుతుంటారు. అయితే పోలీసుల దాడుల నుంచి తప్పించుకోవడానికి వీరు రకరకాల తిప్పలు పడుతారు. అటవీ ప్రాంతాలు, పడుబడ్డ ఇళ్లలో సైతం పేకాట ఆడుతారు. అంతేగాకుండా కొంతమంది ప్రత్యేకంగా పేకాట స్థావరాలను నిర్వహించి డబ్బులు వసూలు చేస్తుంటారు. అయితే తాజాగా కొందరు యువకులు పేకాడటానికి వెళ్లి నదిలో చిక్కుకుపోయారు.

    Nellore | వరద చుట్టుముట్టడంతో..

    నెల్లూర్​లోని భగత్​ సింగ్​ కాలనీ సమీపంలో పెన్నా నది (Penna River)లో 17 మంది యువకులు పేకాడటానికి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి యువకులు నది మధ్యలోకి వెళ్లి పత్తాలు ఆడుతుండగా.. అనుకొని ప్రమాదం ఎదురైంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో సోమశిల రిజర్వాయర్​ (Somashila Reservoir)కు భారీగా వరద వచ్చింది. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో పెన్నా నదిలోకి భారీగా వరద వచ్చింది. ఆ సమయంలో పేకాడుతున్న యువకులను వరద చుట్టు ముట్టింది. పోలీసులకు చిక్కకుండా నదిలోకి వెళ్లిన యువకులు వరదలో చిక్కుకోవడంతో ఆందోళన చెందారు. తమను కాపాడాలని కేకలు వేశారు.

    Nellore | కాపాడిన ఫైర్​ సిబ్బంది

    వరద నీరు చుట్టు ముట్టడంతో యువకులు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక బంధువులకు ఫోన్​ చేశారు. వారు అధికారులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్ని మాపక, నీటి పారుదల శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం తాళ్ల సాయంతో నదిలో చిక్కుకున్న యువకులను కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

    More like this

    Job Mela | కామరెడ్డిలో నిరుద్యోగులకు జాబ్​మేళా

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Job Mela | కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) నిరుద్యోగ యువతకు ప్రైవేట్​ రంగంలో ఉద్యోగావకాశాలు...

    Private School | ప్రైవేట్​ పాఠశాలలో దారుణం.. విద్యార్థిని తల పగిలేలా కొట్టిన టీచర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private School | ఓపికగా ఉండి విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన కొందరు టీచర్లు (Teachers)...

    Yellareddy mandal | పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారుల సర్వే

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy mandal | ఎల్లారెడ్డి మండలంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకంలో (Pradhan Mantri...