అక్షరటుడే, వెబ్‌డెస్క్: bone glue | సాధారణంగా ప్రమాదాల్లో ఎముకలు Bones విరిగితే అవి మామూలు స్థితికి రావడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు సమయం పడుతుంది.
డాక్టర్లు ఆపరేషన్ల ద్వారా స్టీల్ ప్లేట్లు అమర్చడం, గంటల తరబడి శస్త్రచికిత్స చేయడం లాంటి ప్రక్రియలు అనుసరిస్తారు. ఈ సమయంలో రోగికి అనేక సమస్యలు తలెత్తుతాయి.
అయితే తాజాగా చైనా శాస్త్రవేత్తలు ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. తూర్పు చైనాలోని షెజాంగ్ ప్రావిన్స్‌లో ‘బోన్-02’ అనే ప్రత్యేక గ్లూ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి పరిచయం చేశారు.
ఈ బోన్ గ్లూను కేవలం ఇంజెక్షన్ రూపంలో శరీరంలోకి పంపితే, విరిగిన ఎముకలు మూడు నిమిషాల్లోనే అతుక్కుంటాయని శాస్త్రవేత్తలు Scientists తెలిపారు.
bone glue | ఎలా పని చేస్తుందంటే..
అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ Orthopedic Surgeon, పరిశోధక బృందం నాయకుడు లిన్ షాన్‌ఫింగ్ వివరాల ప్రకారం..
- ఈ బోన్ గ్లూ రక్తప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.
- పెద్ద కోసులు, మెటల్ ఇంప్లాంట్లు అవసరం లేకుండానే ఎముకలు అతుక్కుంటాయి.
- ల్యాబ్ టెస్టుల్లో ఇది విజయవంతంగా పనిచేసిందని నిర్ధారించారు.
ఈ గ్లూ Glu శరీరంలో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు, ఇన్‌ఫెక్షన్లు కలిగించదని, ఎముక అతికిన తర్వాత అది శరీరంలో కలిసిపోతుందని తెలిపారు. అందువల్ల రెండోసారి ఆపరేషన్ అవసరం ఉండదు.
నీటి అడుగున బ్రిడ్జిలకు Bridges గట్టిగా అతుక్కునే ఆల్చిప్పల స్ఫూర్తితో ఈ బోన్ గ్లూను తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో ఆర్థోపెడిక్ సర్జరీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే “బోన్-02” భద్రత – ప్రభావ ప్రమాణాలు రెండింటిలోనూ మంచి పనితీరు ప్రదర్శించడంతో అంతా సంతోషించారు. ఒక ట్రయల్‌లో, ఈ ప్రక్రియ 180 సెకన్లు లేదా మూడు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే పూర్తైనట్టు తేలింది.