అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan in danger Zone | ఆసియా కప్ 2025లో Asia Cup 2025 ఆతిథ్య యూఏఈ UAE జట్టు ఖాతా తెరిచింది. సోమవారం (సెప్టెంబరు 15) జరిగిన లీగ్ మ్యాచ్‌లో పసికూన ఒమన్‌పై 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ Indian Team చేతిలో ఎదురైన పరాజయం నుంచి కోలుకున్న యూఏఈ ఈ విజయంతో టోర్నీలో సత్తా చాటింది. ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది.
కెప్టెన్ ముహమ్మద్ వసీం (69; 54 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలిషన్ షరఫు (51; 38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.
జోహైబ్ (21), హర్షిత్ కౌషిక్ (19 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించారు. ఒమన్ బౌలర్లలో జితెన్ రమనంది (2/24) రెండు వికెట్లు తీయగా, హస్‌నైన్ షా, సామ్య శిరవస్తవా చెరో వికెట్ దక్కించుకున్నారు.
Pakistan in danger Zone | ఇంట్రెస్టింగ్ ఫైట్..
లక్ష్య ఛేదనలో ఒమన్ Oman 18.4 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. జతిందర్ సింగ్ (20), ఆర్యన్ బిస్త్ (24), వినాయక్ శుక్లా (20) మాత్రమే కొంత ప్రతిఘటించారు.
యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖ్ (4/23) నాలుగు వికెట్లు తీయగా, హైదర్ అలీ (2/22), ముహమ్మద్ జవదుల్లా (2/18) రెండేసి వికెట్లు తీశారు. ఈ ఓటమితో ఒమన్ సూపర్-4 రేసు నుంచి నిష్క్రమించింది.
మరోవైపు గ్రూప్-ఏలో భారత్ వరుస విజయాలతో అగ్రస్థానంలో నిలిచి సూపర్-4 బెర్త్ ఖాయం చేసుకుంది. పాకిస్థాన్ రెండో స్థానంలో ఉన్నా, చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈపై గెలవకపోతే నిష్క్రమించాల్సిందే.
యూఏఈ విజయం సాధిస్తే సూపర్-4లోకి దూసుకుపోతుంది. దీంతో పాకిస్థాన్ ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక మరో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హాంగ్ కాంగ్ జట్టు Hongkong నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది.
ఓపెనర్ అన్షీ రత్(46 బంతుల్లో 4 ఫోర్లతో 48), నిజకత్ ఖాన్(38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 నాటౌట్) రాణించగా, శ్రీలంక బౌలర్లలో దుష్మంత్ చమీరా(2/29) రెండు వికెట్లు దక్కించుకున్నారు.
వానిందు హసరంగా, డసన్ షనక చెరో వికెట్ తీసారు. అనంతరం శ్రీలంక 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసి మరో విజయాన్ని దక్కించుకుంది.
ఓపెనర్ పాతుమ్ నిస్సంక(44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) అర్ధ సెంచరీ చేయగా.. కుశాల్ పెరెరా(16 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 20 ) చేశారు.
వానిందు హసరంగా(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడి ఓడిన హాంగ్ కాంగ్ టోర్నీ tournament నుంచి నిష్క్రమించింది.