More
    Homeజిల్లాలుకామారెడ్డిUrea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    Urea bag theft | చేనులో యూరియా బస్తా చోరీ.. వాట్సప్​లో వైరల్..​ ఎక్కడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Urea bag theft | వానా కాలం rainy season సాగు మొదలై నాలుగు నెలలవుతున్నా.. తెలంగాణ Telangana రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తోంది. ఎరువుల కోసం రైతులు అల్లాడుతున్నారు.

    క్యూ లైన్​లలో రోజంతా నిలబడుతూ తంటాలు పడుతున్నారు. అతి కష్టం మీద దొరికన బస్తాలను తలపై ఎత్తుకుని చేను వరకు మోసుకెళ్తున్నారు. కాగా, యూరియాకు ఉన్న డిమాండ్​ నేపథ్యంలో దొంగలు చేనుల వెంట పడ్డారు. పంట పొలాల్లో నుంచి యూరియా బస్తాలను ఎత్తుకెళ్తున్నారు.

    తాజాగా కామారెడ్డి జిల్లా Kamareddy district భిక్కనూరు మండలం రామేశ్వర్​పల్లి గ్రామంలోని పంట పొలాల్లో దొంగతనం జరిగింది. సోమవారం (సెప్టెంబరు 15) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

    బాధితుడు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తక్కల్ల గంగారెడ్డి తన పొలంలోని మక్క(మొక్కజొన్న) పంటకు ఎరువు వేయడానికి యూరియా బస్తాలను తీసుకొచ్చారు.

    వాటిని పొలంలోని వ్యవసాయ బావి agricultural well వద్ద నిల్వ చేశారు. కాగా, అక్కడికి బైక్​పై చేరుకున్న ఇద్దరు యువకులు యూరియా Urea  బస్తాలను ఎత్తుకెళ్లారు.

    Urea bag theft | సీసీ కెమెరాలో రికార్డు

    వాహనంపై మక్క కర్రలు అడ్డుగా పెట్టి, వాటి కింద యూరియా బస్తా వేసుకొని పారిపోయారు. యూరియా బస్తా చోరీ అయిన విషయం గ్రహించిన రైతు వెంటనే ఎంక్వరీ చేస్తూ టోల్​ ప్లాజా toll plaza వద్దకు చేరుకున్నారు.

    అక్కడ సీసీ కెమెరాలో ఇద్దరు యువకులు యూరియా బస్తా ఎత్తుకెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో ఆ వీడియోను తీసుకుని వాట్సప్​ గ్రూపుల్లో షేర్​ చేశారు. అదికాస్త వైరల్​ అయింది.

    అలా దొంగతనం ఫొటో యువకుల ఫోన్​కు కూడా రావడంతో.. వెంటనే యూరియా బస్తా తీసుకుని బాధిత రైతు వద్దకు చేరుకున్నారు. రైతుకు క్షమాపణ చెప్పి, బస్తాను అతడికే ఇచ్చేశారు.

    More like this

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​లో దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ Village...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...

    fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్‌ కాలేజీలు

    అక్షరటుడే, హైదరాబాద్: fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు private college management...