అక్షరటుడే, వెబ్‌డెస్క్: TallaRampur VDC violence | నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ Village Development Committee ల దాష్టీకం కొనసాగుతూనే ఉంది.
తమ మాట వినకుంటే.. అడిగినంత డబ్బులు, పార్టీలు ఇవ్వకుంటే ఎంతకైనా తెగిస్తున్నారు కొన్ని గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు. కులం పేరుతో బహిష్కరిస్తూ తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నారు.
పోలీసులు ఎన్ని కఠన చర్యలు తీసుకున్నా.. ఆయా సంఘాల సభ్యుల ప్రతినిధులు ఎంత చైతన్యం తీసుకొచ్చినా.. ఉన్నత వర్గాల చేతుల్లో ఉండే ఈ కమిటీల సభ్యలు తమ తీరు మార్చుకోవడం లేదు.
TallaRampur VDC violence : కుల బహిష్కరణ సమస్య
తాజాగా ఆర్మూర్ Armur డివిజన్ పరిధిలోని తాళ్ల రాంపూర్ గ్రామంలో మళ్లీ వీడీసీ దాష్టీకం వెలుగుచూసింది. ఈ గ్రామంలో అధికారుల చొరవతో కుల బహిష్కరణ caste boycott సమస్య ముగిసి పోయిందనుకుంటున్న తరుణంలో వివాదం మళ్లీ మొదలైంది.
పంట పొలాల్లోని ఈత చెట్లను తెగ నరికించేశారు వీడీసీ సభ్యులు. దీంతో గౌడ కులస్థులకు, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈత వనాలను తెగ నరికేసిన నేపథ్యంలో గౌడ కులస్థులు తమ సంఘంలో సమావేశమయ్యారు. ఈ విషయం తెలిసిన వీడీసీ VDC సభ్యులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
సంఘం వద్దకు చేరుకున్నాక గౌడ Goud కులస్థులపై దాడికి యత్నించారు. సంఘంలోని సామగ్రిని, వాహనాలను ధ్వంసం చేశారు.
విషయం తెలిసి పోలీసులు, అధికారులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థులను చెల్లాచెదురు చేసి, అక్కడి నుంచి పంపించేశారు.