Smart Phones | న‌థింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ ఫోన్ లాంచ్‌కి స‌న్నాహాలు..ఫీచ‌ర్స్ మాములుగా లేవు!
Smart Phones | న‌థింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ ఫోన్ లాంచ్‌కి స‌న్నాహాలు..ఫీచ‌ర్స్ మాములుగా లేవు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Smart Phones | ఇప్పుడు అనేక ఫోన్స్ మార్కెట్ లోకి వ‌స్తున్నాయి. అయితే మంచి ఫీచ‌ర్స్ ఉన్న ఫోన్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఆ కంపెనీ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటికే నథింగ్‌ Nothing నుంచి ఫోన్ 3ఏ, 3ఏ ప్రో స్మార్ట్‌ఫోన్లు(Smart Phones) రాగా, నథింగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ యూజర్ల దృష్టి నథింగ్ ఫోన్ 3పై ఉంది. ఫోన్ 3 ఫీచర్లపై ఆ కంపెనీ అధికారికంగా వివరాలు తెలపనప్పటికీ లీక్‌ల ద్వారా కొన్ని ఫీచ‌ర్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో లాంచ్ అవుతుందని అంచనా. దాదాపు జులై, సెప్టెంబర్ మధ్య ఎప్పుడైనా లాంచ్‌ కావచ్చు.

Smart Phones | మంచి ఫీచ‌ర్స్‌తో..

భారత్‌లో నథింగ్ ఫోన్(Nothing Phone) 3 ధర రూ.45,000 – రూ.50,000 మధ్య ఉండవచ్చని టాక్. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నథింగ్ ఫోన్‌ 3 ధర రూ.44,999. ఫోన్ 3 డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల AMOLED LTPO స్క్రీన్‌తో ఉంటుంది. ఫోన్ 3 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ ద్వారా రన్ అవుతుంది. 12GB వరకు RAM, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రావచ్చు. బ్యాటరీ సామర్థ్యం 5,000mAh లేదా 5,300mAh ఉండొచ్చు. 50W ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఉంటుంది. కస్టమ్ ఏఐ అసిస్టెంట్ కూడా ఇందులో ఉండొచ్చు.

ఫొటోగ్రఫీ(Photography) కోసం నథింగ్ ఫోన్ 3లో మూడు 50MP బ్యాక్‌ కెమెరాలు ఉండవచ్చు. ప్రధాన లెన్స్, అల్ట్రావైడ్, టెలిఫొటో సెన్సార్‌తో రావచ్చు. 32MP సెల్ఫీ కెమెరాను ఉండే అవకాశం ఉంది. కెమెరా విషయానికొస్తే.. నథింగ్ ఫోన్ 3లో 50MP ప్రైమరీ షూటర్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP ఆప్టికల్ జూమ్‌తో సహా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ స్మార్ట్‌ఫోన్ 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించవచ్చు.