అక్షరటుడే, హైదరాబాద్: fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు private college management జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి. కళాశాలలను యథావిధిగా కొనసాగిస్తామని ఆయా యాజమాన్యాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి కాలేజీలు తెరచుకోనున్నాయి.
fee reimbursement : రూ. 600 కోట్ల చొప్పున..
డిప్యూటీ సీఎం భట్టి Deputy CM Bhatti విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి Minister Uttam, Minister శ్రీధర్‌బాబు Sridhar Babu తో సోమవారం (సెప్టెంబరు 15) కాలేజీ యాజమాన్యాల చర్చలు జరిపాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో జరిగిన చర్చల్లో ప్రస్తుతం రూ.600 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. మరో రూ.600 కోట్లు దీపావళికి ఇస్తామని పేర్కొంది.