అక్షరటుడే, హైదరాబాద్: KTR defamation case కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ BRS Working President KTR పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి నిరాధార ఆరోపణలు చేశారనేది కేటీఆర్ వాదన.
ఈ మేరకు రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు పరువు నష్టం దావా కేసుపై బండి Union Minister Bandi Sanjay స్పందించారు.
కరీంనగర్లో సోమవారం (సెప్టెంబరు 15) మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. పరువు నష్టం దావా కేసుతో కేటీఆర్ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బండి పేర్కొన్నారు.
కేటీఆర్ వేసిన కేసును న్యాయపరంగానే ఎదుర్కొంటానని బండి సంజయ్ చెప్పారు. గతంలో తొమ్మిది సార్లు జైలుకు వెళ్ళి వచ్చానని బండి తెలిపారు. తనపై వందకు పైగా కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది స్పష్టం చేశారు. తాను లవంగం తింటే తంబాకు తిన్నానని కేటీఆర్ అన్నారని, తలుచుకుంటే తాను కూడా పరువు నష్టం దావా కేసులు వేయొచ్చన్నారు.
కానీ తాను రాజకీయంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఇలా పరువు నష్టం దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేయనన్నారు.
తెలంగాణలో భారాస ప్రభుత్వ హయాంలో ఫోన్లు ట్యాప్ జరగకపోతే.. కుటుంబ సభ్యులతో సహా దేవుడి సన్నిధికి రావాలని సవాల్ విసిరానని గుర్తుచేశారు.
మరీ కేటీఆర్ ఎందుకు రావడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అమెరికాలో కేటీఆర్ ఎవరెవరిని కలిశారో.. కేటీఆర్ సంగతి ఏమిటో త్వరలో బయటపెడతానని బండి సంజయ్ అన్నారు.
KTR defamation case | ఏమిటీ కేసు..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజజ్పై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోర్టుకెక్కారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు కోర్టులో ఉండగానే.. తనపై నిరాధార ఆరోపణలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు Hyderabad City Civil Court లో దావా దాఖలు చేశారు.
బండి సంజయ్ Union Minister Bandi Sanjay పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు డిసెంబరు 15, 2025కి వాయిదా వేసింది.