అక్షరటుడే, ఇందూరు: Police Summar Camp | తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకున్నప్పుడే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి(Judge GVN Bharathalakshmi) పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్‌క్యాంప్ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. క్యాంప్‌లో విద్యార్థినులకు ఈవ్‌టీజింగ్‌ను ఎదుర్కొనే మెళకువలు నేర్పించడం అభినందనీయమన్నారు. కేరీర్ బిల్డప్ (Career Buildup) కంటే క్యారక్టర్ బిల్డప్ (Character Buildup) అనేది చాలా ముఖ్యమైందన్నారు.
అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) మాట్లాడుతూ.. ప్రధానంగా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. క్యాంప్‌లో విద్యార్థినులకు తైక్వాండో (Taekwondo), సెల్ఫ్ డిఫెన్స్ (Self-defense) శిక్షణనిచ్చామన్నారు. వేసవి సెలవును సద్వినియోగం చేసుకుని లక్ష్యంవైపు దూసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్, సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ కిషన్, తైక్వాండో ట్రెయినర్ మనోజ్, జేసీఐ సభ్యులు విజయానంద్, ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ సభ్యులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.