అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nizamabad | తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet) మండలం అల్జాపూర్కు చెందిన గైని పంచశీల కోరారు.
ఈ మేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Chaitanya)ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త లక్ష్మణ్ మరణించడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది. అయితే సంతోష్ అనే వ్యక్తి తరచూ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది.
ఆ వ్యక్తితో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు నల్లమారి సుధాకర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పోసాని, శ్రీకాంత్ ఉన్నారు.