అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ (Armoor Mandal Pastors Association) నూతన కార్యవర్గ ఎన్నికను సోమవారం నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipal) పరిధిలోని మామిడిపల్లి పాస్టర్స్ భవన్లో కార్యక్రమం నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా బ్రదర్ రమేష్ జాన్, ప్రధాన కార్యదర్శిగా పాస్టర్ దినకరన్ రాజ్ పాల్, కోశాధికారిగా పాస్టర్ మధు ఎన్నికయ్యారు.
కాగా.. అధ్యక్షుడు రమేష్ జాన్‌ను అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోగా, కార్యదర్శి, ట్రెజరర్లను ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. ఎలక్షన్ కమిటీ నిర్వాహకులుగా సునీల్, ప్రభుదాస్, దైవ చిత్తం, ఇమ్మానుయేల్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రమేష్ జాన్ మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో క్రైస్తవ సార్వత్రిక సంఘం సంక్షేమం కోసం పాటుపడతామన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ మండల సంఘ కాపరులు నాయకులు పాల్గొన్నారు.