More
    HomeజాతీయంRailway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. టికెట్​ బుకింగ్​కు ఆధార్ అథెంటికేషన్‌ తప్పనిసరి

    Railway Passengers | రైల్వే ప్రయాణికులకు అలెర్ట్​.. టికెట్​ బుకింగ్​కు ఆధార్ అథెంటికేషన్‌ తప్పనిసరి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | రైల్వే బోర్డు (Railway Board) కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల రిజర్వేషన్​ విధానంలో పలు మార్పులు తీసుకొచ్చింది.

    రైల్వే టికెట్లను ప్రయాణికులను ఐఆర్​సీటీసీ (IRCTC) నుంచి బుక్​ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సాధారణ టికెట్ల బుకింగ్​ కోసం ఆధార్​ అథెంటికేషన్​ అవసరం లేదు. అయితే ఇక నుంచి దీనిని తప్పని సరి చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. టికెట్లు విడుదలయ్యాక ఐఆర్​సీటీసీ, అధికారిక యాప్​లో మొదటి 15 నిమిషాలు ఆధార్​ వెరిఫైడ్‌ యూజర్లు మాత్రమే టికెట్లు బుక్​ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ విధానం తత్కాల్​ టికెట్ (Tatkal ticket)​ బుకింగ్​లో అమలు చేస్తున్నారు. అక్టోబర్​ 1 నుంచి సాధారణ రిజర్వేషన్లకు కూడా అమలు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

    Railway Passengers | పక్కదారి పట్టకుండా..

    దేశంలో నిత్యం కోట్లాది మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. చాలా మంది తమ ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను ముందుగానే బుక్​ చేసుకుంటారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ముఖ్యమైన నగరాలకు రద్దీ అధికంగా ఉంటుంది. ఆయా రైళ్లలో టికెట్లకు భారీగా డిమాండ్​ ఉంటుంది. ప్రస్తుతం 60 రోజుల ముందుగా టికెట్​ బుక్​ (Ticket Booking) చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే రద్దీ అధికంగా ఉండే మార్గాల్లో టికెట్లను కొందరు అక్రమార్కులు బుకింగ్‌ ప్రారంభమైన వెంటనే సాఫ్ట్‌వేర్ సాయంతో బుక్‌ చేసేస్తున్నారు.

    దీంతో సామాన్య ప్రయాణికులు టికెట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో టికెట్లు పక్కదారి పట్టకుండా ఆధార్​ అథెంటికేషన్​ను రైల్వే బోర్డు తప్పనిసరి చేసింది. సామాన్యులకు సైతం టికెట్లు దొరకాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వేస్టేషన్ రిజర్వేషన్ కౌంటర్‌లో టికెట్ బుకింగ్ సమాయాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాగా ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​ లేదా యాప్​లో ఆధార్​ నంబర్​ ఎంటర్​ చేసి, డిటెయిల్స్​ సరి చూసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ ఎంటర్​ చేస్తే ఆధార్​ అథెంటికేషన్ (Aadhaar Authentication)​ పూర్తి అవుతుంది.

    More like this

    TallaRampur VDC violence | తాళ్ల రాంపూర్​పై దారుణం.. గౌడ కులస్థులపై వీడీసీ దాష్టీకం.. మూకుమ్మడి దాడి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TallaRampur VDC violence | నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ డివిజన్​లో విలేజ్​ డెవలప్​మెంట్​ కమిటీ (వీడీసీ)...

    Telangana Public Governance Day | తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబరు 17.. సర్కారు ఉత్తర్వులు జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Public Governance Day | తెలంగాణ విమోచన దినోత్సవంగా ఓ పార్టీ.. తెలంగాణ విలీన...

    fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం చర్చలు సఫలం.. బంద్‌ను విరమించుకున్న ప్రైవేట్‌ కాలేజీలు

    అక్షరటుడే, హైదరాబాద్: fee reimbursement | ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వంతో ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు private college management...