అక్షర టుడే, ఎల్లారెడ్డి: Anganwadi teachers | ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు (Yellareddy ICDS project) పరిధిలో అంగన్వాడీ టీచర్లకు సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ‘పోషణ్ భీ – పడాయి భీ’లో భాగంగా మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందని, మొదటి రోజు 251 మంది అంగన్వాడీ టీచర్ల (Anganwadi teachers) పాల్గొన్నారు.
వీరిని మూడు బృందాలుగా విభజించి శిక్షణ అందించనున్నట్లు సీడీపీవో స్వరూప తెలిపారు. పౌష్టికాహారంపై దృష్టి సాధించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ నాన్ ఫార్మల్ విద్య నాణ్యతను మెరుగుపరచడం కార్యక్రమ ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు భారతి, హారతి, వినోదిని, బ్లాక్ కో–ఆర్డినేటర్ కళ్యాణి పాల్గొన్నారు.