అక్షర టుడే, వెబ్‌డెస్క్: OG New Song | పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ Pawan Kalyan హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ (OG–ఓజస్ గంభీర)’ విడుదల దగ్గరపడుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచుతున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన ‘హంగ్రీ చీతా’ (Hungry Cheetah), ‘ఫైర్ స్ట్రామ్’, ‘సువ్వి సువ్వి’, ‘ఓమీ గ్లింప్స్’ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. వీటన్నింటిలోనూ తమన్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా మేకర్స్ మరో హైప్ క్రియేట్ చేశారు. ‘గన్స్ అండ్ రోజెస్’ పేరుతో సాగే కొత్త పాటని విడుదల చేశారు. ఈ పాట మాస్‌కి మంచి కిక్ ఎక్కించేలా ఉంది. థమన్ ఈ సాంగ్‌లోనూ సంగీతం అదరగొట్టాడు.
OG New Song | అదిరిందంతే..
ఇప్పటి వరకు వచ్చిన పాటలు యాక్షన్, స్టైల్ ఎలిమెంట్స్‌తో నిండిపోతే, ఈ పాటలో ప్రేమతో పాటు ఓజీ గాంభీర్యం మేళవించినట్టు కనిపిస్తోంది. దీంతో ఈ పాట పవర్‌ఫుల్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది. మేకర్స్ ఇప్పటికే అభిమానుల్లో భారీ క్రేజ్ క్రియేట్ చేసిన నేపథ్యంలో, ‘గన్స్ అండ్ రోజెస్’ (Guns and Roses) సాంగ్ కూడా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో డిజే టిల్లు మూవీ హీరోయిన్ నేహా శెట్టి (heroine Neha Shetty) స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మధ్య నేహా శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలోనే ఓజీ మూవీతో మీ ముందుకు వస్తున్నాను అంటూ చెప్పడంతో ప్రచారాలు ఎక్కువయ్యాయి.
ఓజీలో స్పెషల్ పాటతోపాటు మరికొన్ని కీలక సన్నివేశాల్లోనూ నేహా శెట్టి నటించనుందని, ఇప్పటి వరకు అయితే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఇక ఈ మూవీకి సంబంధించి సెప్టెంబర్ 19న అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 20న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయాలని మేకర్స్ ప్లాన్. హైదరాబాద్‌తో (Hyderabad)పాటు ఏపీలో (Andhra pradesh) కూడా ప్రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ ఈవెంట్స్‌కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరు అవుతాడా, లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.