More
    Homeజిల్లాలునిజామాబాద్​CP Sai Chaitanya | పోలీసు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి: సీపీ సాయిచైతన్య

    CP Sai Chaitanya | పోలీసు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి: సీపీ సాయిచైతన్య

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతిఒక్కరూ పోలీసులు సూచించిన నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

    ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదన్నారు. ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్ (Collector Vinay krishna Reddy) ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందన్నారు.

    CP Sai Chaitanya | శబ్దకాలుష్యం నియంత్రణ

    ఎక్కువ శబ్దంతో డీజేలను (DJ Sounds) ఏర్పాటుచేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. రెసిడెన్షియల్, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్​ పూర్తిగా నిషిద్ధమన్నారు.

    CP Sai Chaitanya | పోలీసుల అనుమతి తప్పనిసరి..

    ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజే సౌండ్​ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేట్​ పరిధిలో నిషేధమని సీపీ స్పష్టం చేశారు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు (Loudspeakers) పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని సూచించారు.

    CP Sai Chaitanya | ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలి

    మాల్స్, సినిమా థియేటర్స్ (Movie theaters), హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలని కోరారు.

    CP Sai Chaitanya | డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు

    డ్రోన్ల (Drones) వాడకం వల్ల ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుందని సీపీ పేర్కొన్నారు. ఈ డ్రోన్ల ఉపయోగం వల్ల జనజీవనానికి ఇబ్బంది కలగడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యవసరమైతే పోలీస్​, ఏవియేషన్​ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.

    CP Sai Chaitanya | నకిలీ గల్ఫ్​ ఏజెంట్లతో జాగ్రత్త..

    జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లు (Gulf agents) ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాస్ పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని.. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇళ్లు అద్దెకు ఇచ్చేముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.

    అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్​కు తెలియజేయాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం పోలీసులకు తెలియజేయాలని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ‘ఏ’ సర్టిఫికేట్ పొందిన సినిమాలను మైనర్లు చూడడానికి ధియేటర్ల సిబ్బంది అనుమతించద్దని ఆదేశాలు జారీ చేశారు.

    CP Sai Chaitanya | బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధం

    బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు వీధుల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా తెలుస్తోందని.. వీరిపట్ల పోలీస్​శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని సీపీ హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించిన యెడల తగు చర్యలు తీసుకుంటామని.. దీనికి సంబంధించి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని ఎస్​హెచ్​వో, ఎస్సైలకు పూర్తి అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

    More like this

    Medha School | పగలంతా తరగతులు.. రాత్రి మత్తు మందు తయారీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medha School | హైదరాబాద్​ (Hyderabad)లోని బోయిన్​పల్లి మేధా పాఠశాలలో మత్తు మందు తయారు...

    KTR meets medical students | మెడికల్ విద్యార్థులతో కేటీఆర్ భేటీ.. కొత్త స్ధానికత జీవోపై చర్చ.. జరుగుతున్న నష్టంపై ఆవేదన

    అక్షరటుడే, హైదరాబాద్: KTR meets medical students | తెలంగాణలో కొత్త స్ధానికత జీవో కారణంగా నష్టపోతున్న మెడికల్...

    Nizamabad | తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | తనను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet) మండలం...