అక్షరటుడే, డిచ్‌పల్లి : MLA Bhupathi Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బర్దిపూర్‌కు చెందిన బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పైడిపల్లి నర్సయ్య, తన అనుచరులతో కలిసి సోమవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) సమక్షంలో పార్టీలో చేరగా, ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ (Congress Party) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి పలువురు పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. బర్దిపూర్‌కు చెందిన యువకులు తరుణ్ కుమార్, యశ్వంత్, సంజీవ్ గౌడ్, అనంత్, సాయికుమార్, అభిలాష్, మహమ్మద్ అయాన్, మహమ్మద్ అఫ్రీన్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు భాస్కర్, మాజీ సర్పంచ్ ఈగ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయిలు, తదితరులు పాల్గొన్నారు.