More
    Homeజిల్లాలునిజామాబాద్​Bheemgal | భీమ్‌గల్‌లో బీజేపీ కార్యశాల

    Bheemgal | భీమ్‌గల్‌లో బీజేపీ కార్యశాల

    Published on

    అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal | పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం కార్యశాల నిర్వహించారు. మండలాధ్యక్షుడు ఆరే రవీందర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, మండల ఇన్‌ఛార్జి నోముల నర్సారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ (PM Modi) జన్మదిన సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

    17న రక్తదాన శిబిరం (blood donation camp), 18న స్వచ్ఛభారత్, 25న దీన్‌ దయాళ్‌కు నివాళులర్పించి మొక్కలు నాటాలని సూచించారు. 28న విశిష్ట వ్యక్తులకు సన్మానం, అక్టోబర్‌ 2న గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగరవేయాలన్నారు.

    కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు భూక్యా మోహన్, ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కార్యదర్శులు లక్ష్మీ నారాయణ, రజినీకాంత్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు లింబాద్రి నాయక్, సీనియర్‌ నాయకులు లింగం, పురస్తు దినేష్, గంగాధర్‌ గౌడ్, సీహెచ్‌ రాజేశ్వర్, దేవి శెట్టి శ్రీనివాస్, బద్దం సుజిత్‌ రెడ్డి, శక్తి లక్ష్మణ్, కొట్టాల అశోక్, బదావత్‌ ప్రకాష్‌ నాయక్, సుదర్శన్, తోట రమేష్, మండల పదాధికారులు, బూత్‌ అధ్యక్షులు పాల్గొన్నారు.

    More like this

    KTR meets medical students | మెడికల్ విద్యార్థులతో కేటీఆర్ భేటీ.. కొత్త స్ధానికత జీవోపై చర్చ.. జరుగుతున్న నష్టంపై ఆవేదన

    అక్షరటుడే, హైదరాబాద్: KTR meets medical students | తెలంగాణలో కొత్త స్ధానికత జీవో కారణంగా నష్టపోతున్న మెడికల్...

    Nizamabad | వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసిన మహిళ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని నవీపేట (Navipet)...

    Tirumala | తిరుమల బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు....