More
    HomeతెలంగాణFee Reimbursement | రీయింబర్స్​మెంట్​ చర్చలపై కీలక ట్విస్ట్​.. కాలేజీల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి

    Fee Reimbursement | రీయింబర్స్​మెంట్​ చర్చలపై కీలక ట్విస్ట్​.. కాలేజీల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Fee Reimbursement | ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిల కోసం ప్రైవేట్​ కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే పలు కాలేజీలు బంద్​ పాటిస్తున్నాయి.

    రాష్ట్రంలోని ప్రైవేట్​ ఇంజినీరింగ్​, ఇతర కాలేజీలకు భారీగా ఫీజు రీయింబర్స్​మెంట్(Fee Reimbursement)​ బకాయిలు పేరుకుపోయాయి. వాటిని విడుదల చేయాలని కాలేజీల యాజమాన్యాలు డిమాండ్​ చేస్తున్నాయి. లేదంటే సోమవారం (నేటి) నుంచి కాలేజీలు బంద్ చేస్తామని గతంలోనే కాలేజీ యజమానులు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రైవేట్​ కాలేజీల సంఘం నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) చర్చించారు. అయితే చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సోమవారం సాయంత్రం మరోసారి చర్చలు జరపనున్నారు.

    Fee Reimbursement | సీఎంతో మంత్రుల భేటీ

    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్​బాబు సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిల విషయంలో కాలేజీల డిమాండ్లపై వారు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రైవేట్​ కాలేజీల నాణ్యతపై దృష్టి పెట్టినట్లు సమాచారం. కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపై బీఆర్‌ఎస్‌ హయాంలో విజిలెన్స్​ కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్టును ప్రస్తుతం ప్రభుత్వం బయటకు తీసినట్లు తెలుస్తోంది.

    Fee Reimbursement | కాలేజీల్లో అక్రమాలు

    విజిలెన్స్​లో నివేదికలో ప్రైవేట్​ కాలేజీల(Private Colleges) అక్రమాలపై వివరాలు ఉన్నట్లు సమాచారం. చాలా ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, నాణ్యత పాటించకుండా ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని కాలేజీలు వినియోగించుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో కాలేజీల అక్రమాలు, నాణ్యత విషయాలను ప్రభుత్వం చర్చల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. బకాయిల విషయంలో యాజమాన్యాలు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం ఈ రిపోర్టు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కాలేజీలు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ కాలేజీలు తమ పట్టు వదలకపోతే ఈ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పనున్నట్లు తెలుస్తోంది.

    Fee Reimbursement | బంద్​కు బీజేపీ మద్దతు

    ప్రైవేట్‌ కాలేజీల బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు(Ramchandra Rao) తెలిపారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు ఇవ్వకపోవడంతో జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు.

    More like this

    KTR | కేంద్ర మంత్రి సంజయ్​పై కేటీఆర్​ రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)​పై మాజీ మంత్రి, బీఆర్ఎస్​...

    Supreme Court | అలాగైతే మొత్తం రద్దు చేస్తాం.. ఈసీకి సుప్రీంకోర్టు హెచ్చరిక

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Supreme Court | బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) డ్రైవ్లో...

    Anganwadi Centers | అంగన్​వాడీ భవన నిర్మాణాలను ప్రారంభించాలి

    అక్షరటుడే, ఇందూరు: Anganwadi Centers | అంగన్​వాడీ కేంద్రాలకు మంజూరైన భవన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కలెక్టర్ వినయ్...