Mla Dhanpal Suryanarayana Guptha | పనులను నాణ్యతతో పూర్తి చేయాలి
Mla Dhanpal Suryanarayana Guptha | పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal Suryanarayana Guptha | శ్మశాన వాటిక పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా (Urban MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. శుక్రవారం నగరంలోని కంఠేశ్వర్​లో సార్వజనిక్ శ్మశాన వాటిక (Public cemetery) పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం (14th Finance Commission) ద్వారా రూ.25లక్షల వ్యయంతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఇందులో వెయిటింగ్ హాల్, బర్నింగ్ ప్లాట్ ఫామ్, ప్రహరీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈఈ మురళి, బీజేపీ నాయకులు న్యాలం రాజు, రవి, చంద్రమౌళి, ప్రభాకర్ రెడ్డి, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.