More
    Homeజిల్లాలునిజామాబాద్​Temple Lands | దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

    Temple Lands | దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు : Temple Lands | నిజామాబాద్ జిల్లాలో దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని రాష్ట్రీయ వానరసేన డిమాండ్​ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో (Prajawani) అసోసియేషన్​ ఆధ్వర్యంలో సభ్యులు వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా రాష్ట్రీయ వానరసేన జిల్లా కన్వీనర్ గెంట్యాల వెంకటేష్ మాట్లాడుతూ.. నందిపేట్ (Nandipet) మండలంలోని తల్వేద గ్రామంలో కాకయ్య మందిరానికి దానం చేసిన దేవాలయ భూమిని, ప్రభుత్వ సీలింగ్​ భూములను అక్కడి మాజీ సర్పంచ్ ​(Former Sarpanch) అక్రమంగా తన కుమారులపై రిజిస్ట్రేషన్​ చేసుకున్నారన్నారు.

    ఈ భూముల్లో మాజీ సర్పంచ్​ రైస్​మిల్​ నిర్మించి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే ఆర్మూర్ ఆర్డీవో విచారణ (Armoor RDO Investigation) చేసి నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ భూమిని నలుగురు కుమారుల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినందున, ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

    More like this

    Gutta Jwala | 4 నెలల్లో 30లీట‌ర్ల త‌ల్లి పాల దానం.. అంద‌రి హృదయాలను గెలుచుకున్న గుత్తా జ్వాల..

    అక్షర టుడే, వెబ్‌డెస్క్: Gutta Jwala | పెళ్లి తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది....

    CP Sai Chaitanya | పోలీసు నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి: సీపీ సాయిచైతన్య

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతిఒక్కరూ పోలీసులు సూచించిన...

    MLA Bhupathi Reddy | సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్​లో చేరికలు

    అక్షరటుడే, డిచ్‌పల్లి : MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) అమలు చేస్తున్న పథకాలకు...