అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఆ స్థానాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్‌లో వెంగళరావు నగర్ డివిజన్ బూత్ కమిటీతో సమావేశం అయ్యారు.
కుటుంబం అన్నాక గొడవలు, పంచాయితీలు ఉంటాయని కేటీఆర్(KTR) పేర్కొన్నారు. అయితే బజార్ల పడి కొట్టుకోవడం పద్ధతి కాదన్నారు. సామరస్యంగా కలిసి మెలిసి పనిచేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. జూబ్లీ హిల్స్ స్థానాన్ని గెలుచుకోవడానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. కాగా ఇటీవల కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్(BRS)పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
KTR | హైదరాబాద్‌ను పట్టించుకోవడం లేదు
హైదరాబాద్‌లో (Hyderabad) వర్షాలకు సోమవారం ముగ్గురు యువకులు కొట్టుకుపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరాన్ని పట్టించుకునే వారు లేరన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by Election) కోసం ముగ్గురు మంత్రులను పెట్టారని, కానీ వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఎవరికీ బాధ్యతలు ఇవ్వలేదని విమర్శించారు. నగరంలో క్రైమ్ రేట్ పెరిగిందని ఆయన ఆరోపించారు. చందానగర్‌లో పట్టపగలే బంగారం దుకాణంలో చోరీ చేశారన్నారు. అయినా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.
KTR | ఒక్క మంత్రి కనిపించడు..
ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న మంత్రులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయితే అసలు కనిపించరని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ప్రజల కష్టాల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. “మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇళ్లు మీరు కూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే” అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో 36 ఫ్లై ఓవర్లు కడితే.. కాంగ్రెస్ నాయకులు కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చడం లేదని ఎద్దేవా చేశారు.
KTR | వేల ఇళ్లు కూలగొట్టారు
కేసీఆర్ నగరంలో లక్ష మందికి ఇంటి పట్టాలు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) మాత్రం ఒక్క ఇల్లు కట్టకుండా.. వేల ఇళ్లు కూల్చివేసిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టుడా అని ఆయన ప్రశ్నించారు. మూసీ నదిలో పేదల ఇళ్లను కూల్చారన్నారు. ఇంట్లో నుంచి సామగ్రి బయటకు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారన్నారు.
KTR | రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు
వైఎస్ రాజశేఖరరెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రస్తుతం బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు కాలేజీలను మూసి వేశాయన్నారు. డబ్బులు లేవని, రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.