అక్షరటుడే, భీమ్‌గల్: Anganwadi Teachers | నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలను తెలిపేందుకు ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (Mla Prashanth Reddy) క్యాంప్ ఆఫీస్‌కు వెళ్తున్నట్లుగా ముందస్తు సమాచారం మేరకు అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ.. ప్రీస్కూల్స్‌ను (Pre school) అంగన్వాడీలకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్వాడీలను పక్కకు పెట్టి కొత్త పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదన్నారు.
తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. అరెస్టయిన వారిలో నియోజకవర్గంలోని అంగన్వాడీ ఉపాధ్యాయులు, యూనియన్ నాయకులు తదితరులు ఉన్నారు.