అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RRB Notification | భారత రైల్వేలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ శుభవార్త చెప్పింది. సెక్షన్ కంట్రోలర్(Section Controller) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్(Notification) వివరాలిలా ఉన్నాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(Railway Recruitment Board) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్‌లలో మొత్తం 368 పోస్టులతో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్‌పూర్, తిరువనంతపురం రీజియన్‌లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.35,400.
విద్యార్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ(Any Degree) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి : వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 20 నుంచి 33 ఏళ్ల మధ్య వయసువారు అర్హులు : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, అన్ని కేటగిరిల మహిళా అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తు గడువు : అక్టోబర్ 14.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.250 ఫీజు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్ ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనంతరం అర్హులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకోసం వెబ్‌సైట్ https://rrbsecunderabad.gov.in/ లో సంప్రదించగలరు.