అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vishnuvardhan Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్న తరుణంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత విష్ణువర్ధన్‌రెడ్డి(Vishnuvardhan Reddy) సోమవారం కలిశారు.
ఈ నేపథ్యంలో త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by Election) జాగృతి కూడా పోటీ చేస్తుందన్న ప్రచారం మొదలైంది. విష్ణువర్ధన్‌రెడ్డి జాగృతి తరఫున పోటీ చేస్తారన్న ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ప్రచారాన్ని విష్ణు ఖండించారు. దసరా సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో (Jubilee Hills Peddamma Temple) నిర్వహించనున్న ఉత్సవాలకు ఆహ్వానించేందుకు కవితను కలిసినట్లు చెప్పారు.
Vishnuvardhan Reddy | పోటీకి సన్నాహాలు
బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత (Kalvakuntla Kavitha) ఇక సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు, తర్వాతి పరిణామాలపై తను అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడంపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన జరుగుతున్న తొలి ఎన్నికలో పోటీ చేసి, విజయం సాధించడం ద్వారా మిగతా పార్టీలకు బలమైన సందేశం పంపించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న తరుణంలో విష్ణు పేరు తెరపైకి వచ్చింది. అందుకే కవితతో ఆయన భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంతనాలు సాగినట్లు సమాచారం.
Vishnuvardhan Reddy | కొట్టిపడేసిన విష్ణు..
అయితే, జాగృతి తరఫున పోటీ చేస్తారన్న వార్తలను జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి తోసిపుచ్చారు. కవితతో భేటీ అనంతరం విష్ణువర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దసరా వేడుకలకు (Dussehra Celebrations) కవితను ఆహ్వానించానని మాత్రమే వచ్చానని స్పష్టం చేశారు. ఈ వేడుకలకు హాజరు కావాలని ఆమెకు ఆహ్వాన పత్రికను అందజేశానన్నారు.