అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మండలంలోని హన్మాజీపేట్ పెద్ద చెరువు భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో (Sub Collector’s Office) డీఏవో సువర్ణకు (DAO Suvarna) వినతిపత్రం అందజేశారు. చెరువు కింద వందల ఎకరాల ఆయకట్టు ఉందని.. శిఖం కబ్జా అవుతుండడంతో.. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. చెరువు శిఖంను జేసీబీ టిప్పర్ల సాయంతో చదును చేస్తున్నారని, అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, సాయిలు, సంజీవ్, ప్రవీణ్, వెంక గౌడ్, సాయిబాబా, జనార్ధన్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.