అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra Governor | మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ (Acharya Devavrat) సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం గుజరాత్ (Gujarat) గవర్నర్‌గా కొనసాగుతున్నారు.
మహారాష్ట్రగా గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఇటీవల ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) గుజరాత్ గవర్నర్‌గా ఉన్న ఆచార్య దేవవ్రత్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ రాజ్ భవన్‌లో దేవవ్రత్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కాగా మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ ఎన్డీఎ తరఫున ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 9న జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. శుక్రవారం సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Maharashtra Governor | దేవవ్రత్ నేపథ్యం
ఆచార్య దేవవ్రత్ 1959లో పంజాబ్‌లో జన్మించారు. ఆయన 1984 లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. ఆర్య సమాజ్ ప్రచారక్‌గా, హర్యానాలోని కురుక్షేత్ర గురుకుల పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2015 నుంచి ఆగస్టు 12 నుంచి 2019 జులై 21 వరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పని చేశారు. 2019 జులై 22 నుంచి గుజరాత్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.