అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Instagram | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు యూట్యూబ్, టిక్‌టాక్‌ల్లో కనిపించే పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను (Picture in Picture Mode) ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు తన యాప్‌లో టెస్టింగ్ దశలో ప్రవేశపెట్టింది.
ఈ ఫీచర్ ద్వారా ఇతర యాప్స్ వాడుకుంటూనే స్క్రీన్‌లో ఓ చిన్న విండోలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) చూడవచ్చు. ప్రస్తుతం ఇది టెస్ట్ మోడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కొన్ని ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఇది కనిపిస్తోంది. ఈ ఫీచర్ ఒక్కసారి యాక్టివేట్ చేస్తే, యూజర్ ఇన్‌స్టాగ్రామ్ యాప్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా ఫ్లోటింగ్ విండోలో రీల్స్ ప్లే అవుతాయి.
Instagram | కొత్త ఫీచర్స్..
ఇప్పటికైతే ఈ ఫీచర్ కొన్ని ఖచ్చితమైన యూజర్లకే లభిస్తోంది. త్వరలోనే అన్ని యూజర్లకు ఇది అందుబాటులోకి రానుంది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్లకు మరో అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చింది. రీల్స్ ని వేగంగా చూడాలని అనుకునేవారు ఈ ఫీచర్‌తో 2x వేగంగా చూడగలుగుతారు. ఈ ఫీచర్ టిక్‌టాక్‌లోని ప్లేబ్యాక్ ఎంపిక మాదిరిగా పని చేస్తుంది. రీల్స్ చూసే వాళ్లు స్క్రీన్ కుడి లేదా ఎడమ వైపున నొక్కడం ద్వారా 2x వేగంతో రీల్ చూసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ కోసం చాలా మంది ఇన్‌స్టా వినియోగదారులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇన్‌స్టా రీల్స్ వ్యవధిని 3 నిమిషాలకు పెంచిన తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ రీల్స్ చూసే విధంగా వినియోగదారులకు ఈ కొత్త వీడియో ఫార్వార్డింగ్ ఫీచర్ (Forwarding Feature) తీసుకొచ్చారు.
ఇక మనం ఏదైన ఫంక్షన్స్‌లో ఫొటో దిగినప్పుడు చాలా మంది పబ్లిక్ మనక వెనక కనిపిస్తుంటారు. వారందరిని తీసేందుకు కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీకి వెళ్లి మ్యూజిక్ సింబల్ పక్కన ఉన్న పెన్ మార్క్ క్లిక్ చేశాక కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మీకు రీస్టైల్ విత్ మెటా ఏఐ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు రిమూవ్ పీపుల్ ఫ్రమ్ బ్యాక్ గ్రౌండ్ అని టైప్ చేస్తే మీ బ్యాక్ గ్రౌండ్‌లో జనాలు అందరు ఖాళీ అయిపోతారు. అలానే మీరు వేసుకున్న షర్ట్ కలర్ మార్చుకునే అవకాశం కూడా ఉంది. చేంజ్ దిస్ కాస్ట్యూమ్ కలర్ ఇన్‌టూ రెడ్ అని ఇస్తే మనం వేసుకున్న డ్రెస్ కలర్ రెడ్‌లోకి మారిపోతుంది. మరి కొత్త అప్‌డేట్స్ ఒకసారి మీ ఫోన్‌లో ట్రై చేయండి.