అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nizamsagar Project | నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సింగూరు, పోచారం డ్యామ్‌ల (Singur and Pocharam dams) నుంచి జలాశయంలోకి వరద వస్తోంది.
నిజాంసాగర్‌లోకి ప్రస్తుతం 14,564 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1404.5 (17.07 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ అధికారులు (Nizamsagar Project officials) రెండు వరద గేట్లను ఎత్తి దిగువకు 13,564 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు వెయ్యి క్యూసెక్కులు వదులుతున్నారు.
Nizamsagar Project | పోచారం డ్యామ్‌లోకి..
పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project) పొంగిపొర్లుతోంది. ఎగువ నుంచి 2,137 క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా ఉండటంతో వచ్చిన నీరు డ్యామ్‌పై నుంచి పొంగి పొర్లి మంజీరలో కలుస్తోంది. పోచారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1.8 టీఎంసీలు కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 22.5 టీఎంసీల వరద వచ్చింది. అందులో నుంచి ఆయకట్టు కోసం 0.156 టీఎంసీలు విడుదల చేశారు. 20.544 టీఎంసీలు మంజీరలోకి వెళ్లాయి.