More
    HomeజాతీయంOdisha | పూరి జిల్లాలో అద్భుతం .. స్నేక్ క్యాచ‌ర్‌ ఇంట్లో జన్మించిన 19 నాగుపాము...

    Odisha | పూరి జిల్లాలో అద్భుతం .. స్నేక్ క్యాచ‌ర్‌ ఇంట్లో జన్మించిన 19 నాగుపాము పిల్లలు!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Odisha | ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా కాకత్‌పూర్(Kakatpur) ప్రాంతంలో ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. స్నేక్ క్యాచ‌ర్‌(Snake Catcher) నివాసంలో ఒకేసారి 19 నాగుపాము (కోబ్రా) పిల్లలు జన్మించాయి.

    ఈ అరుదైన ఘ‌ట‌న‌కి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్నేక్ క్యాచ‌ర్ బ్రజ్ కిషోర్ సాహు ఇటీవల తన ఇంట్లో ఓ ఆడ కోబ్రా పాము(Cobra Snake)ను రక్షించాడు. ఆ సమయంలో ఆ పాము గర్భవతిగా ఉందని గ్రహించిన అతను, దాన్ని ప్లాస్టిక్ జాడిలో సురక్షితంగా ఉంచాడు. కేవలం రెండు రోజులకే ఆ పాము 19 గుడ్లు పెట్టింది. ఆ వెంటనే ఆడ పామును సాహు అడవిలో వదిలేశాడు.

    Odisha | ఏకంగా అన్ని పిల్ల‌లా..

    ఈ గుడ్లను సాహు జాగ్ర‌త్త‌గా సంరక్షించాడు. సరిగ్గా 60 రోజుల తర్వాత, ఆ గుడ్ల నుండి 19 కోబ్రా పిల్లలు పుట్టాయి. ఈ పాము పిల్లలు(Snake Babies) చిన్నవే అయినా, అవి తీవ్ర విషపూరితమైన‌వి కావ‌డంతో వాటిని జాగ్రత్తగా జాడి నుంచి బయటకు తీసి, అడవిలో వదిలేసాడు. ఈ ఘటనపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పాము పిల్లల వీడియోలు వైరల్ కావడంతో, వాటిని చూసిన నెటిజన్లు ‘అద్భుతం’, ‘వాతావరణ పరిరక్షణకు మంచి ఉదాహరణ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాముల ప్రాణాలు కాపాడిన బ్రజ్ కిషోర్ సాహు కృషి అభినందనీయం. ఈ సంఘటన మరోసారి ప్రకృతి ప‌ట్ల మ‌నుషులు ఎంత బాధ్య‌త‌గా ఉన్నారో తెలియ‌జేస్తుంది. ఈ మ‌ధ్య చాలా చోట్ల ఇళ్ల‌ల్లోకి పాములు రావ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. వాటి నుండి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవ‌డం కోసం చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.ఒక్కోసారి స్నేక్ క్యాచ‌ర్స్ కూడా పాము కాటు బారిన ప‌డి ప్రాణాలు కోల్పోవ‌డం మ‌నం చూశాం.

    More like this

    Flipkart | ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌’ ఆఫర్‌.. రూ.52 వేలకే ఐఫోన్‌ 16!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Flipkart | ఐఫోన్‌ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) గుడ్‌న్యూస్‌ చెప్పింది. బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌...

    Donald Trump | వెనక్కి తగ్గిన ట్రంప్​.. విదేశీ ఉద్యోగులకు ఆహ్వానం అంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | విదేశీ విద్యార్థులు, ఉద్యోగులపై కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు...

    Temple Lands | దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Temple Lands | నిజామాబాద్ జిల్లాలో దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని...