More
    Homeజిల్లాలునిజామాబాద్​Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు భారీగా వరద.. 22 గేట్లు ఎత్తివేత

    Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు భారీగా వరద.. 22 గేట్లు ఎత్తివేత

    Published on

    అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్​ ప్రాజెక్ట్​కు (Sriramsagar project) ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

    వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి (Godavari) వరద పోటెత్తింది. ప్రస్తుతం ఎస్సారెస్పీలోకి లక్ష క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం అంతేనీటిమట్టంతో నిండుకుంలా ఉంది. దీంతో అధికారులు 22 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

    Sriram Sagar | నీటి విడుదల వివరాలు

    ప్రాజెక్ట్​ నిండుకుండలా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద (heavy flood) వస్తుండటంతో అధికారులు దిగువకు నీటి విడుదలను పెంచారు. ఇన్​ఫ్లో కంటే ఔట్​ ఫ్లో అధికంగా ఉండేలా చర్యలు చేపట్టారు. 22 వరద గేట్ల ద్వారా 89,860 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేలు, కాకతీయ కాలువకు 3 వేలు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231, ఆవిరి రూపంలో 684 క్యూసెక్కుల నీరు పొతోంది. మొత్తం 1,07,595 క్యూసెక్కుల ఔట్​ ఫ్లో నమోదు అవుతోంది.

    Sriram Sagar | కొనసాగుతున్న జల విద్యుదుత్పత్తి

    శ్రీరామ్​సాగర్​ దిగువన గల జల విద్యత్​ కేంద్రంలో (hydroelectric power station) ఉత్పత్తి కొనసాగుతోంది. నాలుగు టర్బయిన్ల ద్వారా జెన్​కో అధికారులు విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారు. మరోవైపు గోదావరిలోకి, కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, గోదావరీ పరీవాహక రైతులు సైతం నది సమీపంలోకి వెళ్లొద్దని కోరారు.

    More like this

    Temple Lands | దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Temple Lands | నిజామాబాద్ జిల్లాలో దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని...

    Anganwadi Teachers | పీసీసీ అధ్యక్షుడి ఇంటిని ముట్టడించిన అంగన్​వాడీలు

    అక్షరటుడే, ఇందూరు: Anganwadi Teachers | అంగన్​వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు (CITU leaders)...

    TechD Cybersecurity Limited | ఆసక్తి రేపుతున్న మరో ఐపీవో.. అలాట్‌ అయితే కాసుల పంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TechD Cybersecurity Limited | స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యేందుకు చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి....