More
    HomeతెలంగాణFee Reimbursement | ఫీజు బ‌కాయిల‌పై క‌విత ఆగ్ర‌హం.. పేద‌ల‌ను చ‌దువుకు దూరం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌

    Fee Reimbursement | ఫీజు బ‌కాయిల‌పై క‌విత ఆగ్ర‌హం.. పేద‌ల‌ను చ‌దువుకు దూరం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fee Reimbursement | ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిల విడుద‌ల‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న జాప్యంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమ‌ర్శ‌లు గుప్పించారు.

    పేదలను చ‌దువుకు దూరం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. ఆడబిడ్డల చదువుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ క‌విత(Kalvakuntla Kavitha) సోమ‌వారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కాంగ్రెస్ కమీషన్ల సర్కారు ఆడబిడ్డల చదువులను కాలరాస్తోంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఉద్దేశపూర్వకంగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రేవంత్ ప్రభుత్వం(Revanth Government) ఎగవేస్తోంద‌న్నారు.

    Fee Reimbursement | క‌మీష‌న్లు కోసం..

    ప్ర‌భుత్వం క‌మీష‌న్ల‌కు అల‌వాటు ప‌డి, ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ (Fee Reimbursement) బ‌కాయిలు విడుద‌ల చేయ‌డం లేద‌ని క‌విత ఆరోపించారు. “20 శాతం కమీషన్లు ఇస్తేనే రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇస్తామని ప్రభుత్వంలోని కొందరు డిమాండ్ చేస్తున్నారంటూ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన చెందుతోన్నాయి. కమీషన్ల కోసమే బకాయిలు ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉంచుతున్నారని” మండిపడ్డారు. “ఇప్పటికే కాలేజీలు నడప లేక ఆర్థికంగా యాజమాన్యాలు చితికిపోయాయి.కాలేజీలు మూతపడితే చదువుకు ఆడబిడ్డలు దూరం అవుతారని” కవిత ఎక్స్ లో పోస్టు చేశారు

    Fee Reimbursement | మూత‌బ‌డిన క‌ళాశాలలు..

    ప్ర‌భుత్వం ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో క‌ళాశాల‌ల నిర్వ‌హ‌ణ భారంగా మారింది. నిధులు విడుద‌ల చేయాల‌ని ప‌లుమార్లు ప్ర‌భుత్వాన్ని కొరినా స్పంద‌న రాలేదు. మ‌రోవైపు, ప్ర‌భుత్వంతో జ‌రిపినా చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ప్రైవేట్ క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు సోమ‌వారం నుంచి నిర‌వ‌ధిక బంద్ పాటిస్తున్నాయి. రోజులాగే సోమవారం ఉద‌యం క‌ళాశాల‌ల‌కు వ‌చ్చిన విద్యార్థులు మూసి ఉండ‌డం చూసి వెనుదిరిగారు.

    More like this

    Donald Trump | వెనక్కి తగ్గిన ట్రంప్​.. విదేశీ ఉద్యోగులకు ఆహ్వానం అంటూ పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | విదేశీ విద్యార్థులు, ఉద్యోగులపై కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు...

    Temple Lands | దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు : Temple Lands | నిజామాబాద్ జిల్లాలో దేవాలయ భూములకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని...

    Anganwadi Teachers | పీసీసీ అధ్యక్షుడి ఇంటిని ముట్టడించిన అంగన్​వాడీలు

    అక్షరటుడే, ఇందూరు: Anganwadi Teachers | అంగన్​వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు (CITU leaders)...