More
    Homeక్రీడలుIndia vs Pakistan | భారత్ vs పాక్ మ్యాచ్‌ ముందు విస్మయం కలిగించిన ఘటన.....

    India vs Pakistan | భారత్ vs పాక్ మ్యాచ్‌ ముందు విస్మయం కలిగించిన ఘటన.. జాతీయ గీతం బదులు ‘జిలేబీ బేబీ’ పాట!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India vs Pakistan | ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి భారత్‌ – పాకిస్థాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఒక అవాక్కయ్యే ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల జాతీయ గీతాలు ప్లే చేయడం ఆన‌వాయితీగా వ‌స్తుంది.

    అయితే నిన్న‌టి మ్యాచ్‌కి ముందు పాకిస్థాన్ జాతీయ గీతం(Pakistan National Anthem) ప్లే కావాల్సిన సమయంలో ప్రముఖ పాప్ సాంగ్ ‘జిలేబీ బేబీ’ స్టేడియంలో వినిపించింది. పాకిస్థాన్ జాతీయ గీతానికి సిద్ధమవుతున్న క్షణంలో, చాతీపై చేతులు పెట్టి నిలబడ్డ ఆట‌గాళ్లు నిలుచున్నారు. ఊహించ‌ని విధంగా లౌడ్ స్పీకర్లలో ‘జిలేబీ బేబీ’ పాట(Jilebi Baby Song) వినిపించడంతో ఒక్కసారిగా షాక‌య్యారు. త‌ప్పును గుర్తించిన నిర్వాహకులు వెంట‌నే ఆ పాటను నిలిపివేసి, పాకిస్థాన్ జాతీయ గీతమైన ‘పాక్ సర్జమీన్ షాద్ బాద్స‌ను ప్లే చేశారు.

    India vs Pakistan | బిత్త‌ర‌పోయారు..

    అయితే ఆ విష‌యాన్ని అక్క‌డ ఎవ‌రు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కాని, ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్‌ మ్యాచుల్లో జాతీయ గీతాల విషయంలో ఇలాంటి పొరపాట్లు గతంలోనూ చాలాసార్లు చోటుచేసుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో లాహోర్‌లో పాకిస్తాన్‌(Pakistan)కి బదులుగా భారత జాతీయ గీతం ప్లే కావడం జ‌రిగింది. మ‌రో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జాతీయ గీతం స్థానంలో ‘జనగణమన’ వినిపించడం జ‌రిగింది. అయితే తాజా సంఘటనపై నెటిజన్లు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. ఇది మ్యాచ్ ముందు మైండ్ ఫ్రెష్ చేసే ప్రయత్నమా? అంటూ ట్రోలింగ్ చేశారు.

    ఇక నిన్న‌టి మ్యాచ్ విజ‌యంతో భారత జట్టు, టేబుల్ టాపర్‌గా సూపర్ 4 రౌండ్‌కి కూడా దూసుకెళ్లింది. ముందుగా పాక్ జ‌ట్టు బ్యాటింగ్ చేయ‌గా, 128 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. దీంతో భారత జట్టు(India Team) దూకుడుగా ఆడి కేవలం కేవ‌లం 15.5 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని చేధించింది. ఇండియా ఇన్నింగ్స్‌లో మొదటి 2 ఓవర్లలోనే 22 పరుగులు వచ్చాయి. 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ స్టంపౌట్ కాగా, 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అభిషేక్ శర్మ 31 ప‌రుగులు చేశారు. వీరిద్ద‌రు ఔట‌య్యాక తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కి 56 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. 37 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav).. దూబేతో క‌లిసి మ్యాచ్ ఫినిష్ చేశాడు.

    More like this

    TechD Cybersecurity Limited | ఆసక్తి రేపుతున్న మరో ఐపీవో.. అలాట్‌ అయితే కాసుల పంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TechD Cybersecurity Limited | స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యేందుకు చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి....

    Harish Rao | పేద‌ల పొట్ట కొడుతున్న ప్ర‌భుత్వం.. ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్పుపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వజం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రేవంత్‌రెడ్డి ధ‌న దాహానికి పేద ప్ర‌జ‌లు బ‌ల‌వుతున్నార‌ని మాజీ మంత్రి...

    Private Colleges Association | రేపటి నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్

    అక్షరటుడే, ఇందూరు: Private Colleges Association | ఫీజు రీయింబర్స్​మెంట్​ (Fee reimbursement) బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్​ పీజీ,...