More
    Homeబిజినెస్​IPO | 6 సబ్‌స్క్రిప్షన్‌లు, 12 లిస్టింగ్​లు.. ఈవారంలోనూ ఐపీవోల సందడి

    IPO | 6 సబ్‌స్క్రిప్షన్‌లు, 12 లిస్టింగ్​లు.. ఈవారంలోనూ ఐపీవోల సందడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో (Domestic Stock Market) ఈవారంలోనూ ఐపీవోల (IPO) సందడి కొనసాగనుంది. ఆరు కంపెనీల సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుండగా.. 12 కంపెనీలు లిస్ట్‌ అవనున్నాయి. అయితే అందరి దృష్టి బుధవారం లిస్టయ్యే అర్బన్‌ కంపెనీపై కేంద్రీకృతమై ఉంది. దీని జీఎంపీ(GMP) 60 శాతానికిపైగా ఉండడమే ఇందుకు కారణం.

    ఈ వారంలో ఆరు కంపెనీల పబ్లిక్‌ ఇష్యూ (Public issue) ప్రారంభం కానుంది. ఇందులో మెయిన్‌ బోర్డు కేటగిరీలో మూడు కంపెనీలు ఉండగా.. ఎస్‌ఎంఈ (SME) సెగ్మెంట్‌కు చెందినవి మూడున్నాయి. మెయిన్‌బోర్డు(Main board)కు చెందిన యూరో ప్రతీక్‌ సేల్స్‌, వీఎంఎస్‌ టీఎంటీ కంపెనీ, ఐవాల్యూ ఇన్ఫో సొల్యూషన్స్‌తోపాటు ఎన్‌ఎస్‌ఈ(NSE) ఎస్‌ఎంఈ టెక్‌డీ సైబర్‌ సెక్యూరిటీ, బీఎస్‌ఈ ఎస్‌ఎంఈలు సంపత్‌ అల్యూమినియం, జేడీ కేబుల్స్‌ కంపెనీలు ఉన్నాయి.

    IPO | యూరో ప్రతీక్‌ సేల్స్‌..

    వాల్‌ ప్యానెల్‌లను తయారు చేసే కంపెనీ అయిన యూరో ప్రతీక్‌ సేల్స్‌ (Euro Pratik Sales) ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌.. రూ. 451.31 కోట్లు సమీకరించేందు కోసం ఐపీవోకు వస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.235 నుంచి రూ.247గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 60 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు రూ. 14,820తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీని పబ్లిక్‌ ఇష్యూ మంగళవారం ప్రారంభం కానుంది. గురువారం వరకు బిడ్డింగ్‌కు అవకాశం ఉంటుంది. కంపెనీ షేర్లు 23 వ తేదీన బీఎస్‌ఈ(BSE), ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

    IPO | వీఎంఎస్‌ టీఎంటీ..

    టీఎంటీ ఇనుప కడ్డీల తయారీ కంపెనీ అయిన గుజరాత్‌కు చెందిన వీఎంఎస్‌ టీఎంటీ(VMS TMT) సంస్థ రూ. 148.50 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. ఇది ఫ్రెష్‌ ఇష్యూ. పైస్‌ బ్యాండ్‌ రూ.94 నుంచి రూ. 99గా ఉంది. ఒక లాట్‌లో 150 షేర్లు ఉన్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,850తో దరఖాస్తు చేసుకోవాలి. ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) సెప్టెంబర్‌ 17న ప్రారంభమై 19న ముగుస్తుంది. 22న అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు 24న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టు కానున్నాయి.

    IPO | ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్‌..

    ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్‌(Ivalue Infosolutions) ఐపీవో ద్వారా రూ. 560.29 కోట్లు సమీకరించనుంది. కంపెనీ ధరల శ్రేణిని రూ. 284 నుంచి రూ. 299 గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 50 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం రూ. 14,950తో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పబ్లిక్‌ ఇష్యూ ఈనెల 18న ప్రారంభమవుతుంది. 22 వరకు సబ్‌స్క్రిప్షన్‌ కొసాగుతుంది. 23న ఐపీవో అలాట్‌మెంట్‌ స్టేటస్‌ తెలిసే అవకాశాలు ఉన్నాయి. 25న కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.

    IPO | ఎస్‌ఎంఈ విభాగం నుంచి..

    ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌ నుంచి మూడు కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. టెక్‌డి సైబర్‌ సెక్యూరిటీ (TechD Cybersecurity)కంపెనీ ఐపీవో సోమవారం ప్రారంభ అవుతుంది. 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ కంపెనీ రూ. 38.99 కోట్లు సమీకరించనుంది. గరిష్ట ప్రైస్‌బాండ్‌ వద్ద ఒక్కో షేరు ధర రూ.193గా ఉంది. ఒక లాట్‌లో 1,200 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు రెండు లాట్ల కోసం రూ. 2,31,600 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 22న కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో లిస్టవుతాయి.
    సంపత్‌ అల్యూమినియం(Sampat Aluminium) ఐపీవో సెప్టెంబర్‌ 17న మొదలై 19వ తేదీ వరకు ఉంటుంది. రూ. 30.53 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఇది ఐపీవోకు వస్తోంది. ధరల శ్రేణి రూ. 114- రూ. 120గా ఉంది. ఈ లాట్‌లలో 2,400 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్లకోసం రూ. 2,88,000 లతో బిడ్‌ వేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు 24న బీఎస్‌ఈలో లిస్ట్‌ కానున్నాయి.
    జేడీ కేబుల్స్‌(JD Cables) కంపెనీ రూ. 95.99 కోట్లను సమీకరించనుంది. దీని పబ్లిక్‌ ఇష్యూ సెప్టెంబర్‌ 18వ తేదీన ప్రారంభమై 22 వరకు కొనసాగుతుంది. ఒక్కో షేరు ధరను రూ. 144 నుంచి రూ. 152గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 800 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం రెండు లాట్‌ల కోసం రూ. 2,43,200తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కంపెనీ షేర్లు 25న బీఎస్‌ఈలో లిస్టవుతాయి.

    IPO | ఈ వారం లిస్టింగ్‌లు

    ఈవారం 12 కంపెనీలు లిస్టింగ్‌కు రానున్నాయి. ఇందులో మెయిన్‌ బోర్డ్‌కు చెందిన అర్బన్‌ కంపెనీ(Urban Company) ఐపీవోపైనే అందరి దృష్టి ఉంది. ఈ కంపెనీ షేర్లకు గ్రేమార్కెట్‌లో డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం జీఎంపీ 61 శాతం ఉంది. ఈ కంపెనీ షేర్లు ఈనెల 17న లిస్టవనున్నాయి. శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర, దేవ్‌ యాక్సిలరేటర్‌ షేర్లూ ఇదే రోజు లిస్టవుతాయి.
    ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందిన వశిష్ఠ లగ్జరీ ఫ్యాషన్‌ కంపెనీ షేర్లు సోమవారం బీఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 111 కాగా.. 6.31 శాతం ప్రీమియంతో రూ. 118 వద్ద లిస్టయ్యింది. సెప్టెంబర్‌ 16న నిలాచల్‌ కార్బో మెటాలిక్స్‌, కృపాలు మెటల్స్‌, టౌరియన్‌ ఎంపీఎస్‌, కార్బన్‌ స్టీల్‌ ఇంజనీరింగ్‌ కంపెనీలు లిస్టింగ్‌ అవుతాయి. సెప్టెంబర్‌ 17న జే అంబే సూపర్‌ మార్కెట్స్‌, గెలాక్సీ మెడికేర్‌ కంపెనీలు లిస్టవుతాయి. 18న ఎయిర్‌ఫ్లోవా రైల్‌ టెక్నాలజీ(Airfloa Rail Technology) షేర్లు, 19న ఎల్టీ ఎలెవేటర్‌ షేర్లు లిస్టవుతాయి.

    More like this

    KTR | కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయి.. బజార్ల పడి కొట్టుకోవద్దు.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్​ పెట్టాయి. ఆ స్థానాన్ని...

    Pension Scheme | పింఛన్లను పెంచి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్​ ధర్నా

    అక్షరటుడే,బోధన్ : Pension Scheme | ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్​ ప్రభుత్వం పింఛన్లను పెంచి ఇవ్వాలని...

    Hyderabad Metro | హైద‌రాబాద్ మెట్రోకి బ్రేక్ ప‌డ‌నుందా.. ఎల్&టి నిర్ణ‌యంతో అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి వైదొలగాలని దేశీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్...