More
    HomeతెలంగాణWeather Updates | తెలంగాణలో నేడు భారీ వర్షాలు

    Weather Updates | తెలంగాణలో నేడు భారీ వర్షాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | తెలంగాణలో సోమవారం భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు.

    రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వాన దంచికొట్టింది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్​, మెదక్​, కామారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షం పడింది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వరుణుడు తన ప్రతాపం చూపాడు. సోమవారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు చోట్ల కుండపోత వాన కురుస్తుంది.

    Weather Updates | ఆ జిల్లాలకు అలెర్ట్​

    మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్​, రంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్​, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, భువనగిరి, హన్మకొండ, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్​, ఆదిలాబాద్​ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    Weather Updates | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్​ (Hyderabad) నగరం ఆదివారం కురిసిన వర్షాలతో అతలాకుతలం అయింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలో వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్​ జామ్​ కావడంతో గంటల కొద్ది రోడ్లపై చిక్కుకుపోయారు. సోమవారం సైతం నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    Weather Updates | వర్షపాతం వివరాలు

    రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అత్యధికంగా సిద్దిపేట జిల్లా నారాయణపేటలో 245మి.మీ. వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో 128మి.మీ, హైదరాబాద్​లని ముషీరాబాద్​లో 124, కామారెడ్డి జిల్లా సోమూరులో 108.8, మేడ్చల్​ జిల్లా కాప్రాలో 103.3, హైదరాబాద్​లోని మారేడ్​పల్లిలో 101.8, షేక్​పేటలో 99 మి.మీ. వర్షం కురిసింది.

    Weather Updates | ఆందోళనలో రైతులు

    రాష్ట్రంలో ప్రస్తుతం పంటలు పొట్ట, ఈనిక దశలో ఉన్నాయి. ముందస్తుగా సాగు చేసిన పొలాలు మరో 15 రోజుల్లో కోతకు రానున్నాయి. ఈ తరుణంలో కురుస్తున్న వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్​ మూడో వారం వరకు వర్షాలు పడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

    More like this

    Anganwadi Teachers | అంగన్​వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

    అక్షరటుడే, భీమ్​గల్: Anganwadi Teachers | నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్​వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు....

    Hyderabad Floods | మంచం కోసం వెళ్లి నాలాలో కొట్టుకుపోయారు : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Floods | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించిన విషయం...

    RRB Notification | నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్‌ఆర్‌బీనుంచి జాబ్‌ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RRB Notification | భారత రైల్వేలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వే రిక్రూట్‌మెంట్‌...