More
    HomeతెలంగాణMedha School drug case | బోయిన్‌పల్లి మేధా స్కూల్‌ డ్రగ్స్ తయారీ కేసు.. నిందితుల...

    Medha School drug case | బోయిన్‌పల్లి మేధా స్కూల్‌ డ్రగ్స్ తయారీ కేసు.. నిందితుల రిమాండ్​.. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Medha School drug case | విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్​లో ఇటీవల వెలుగు చూస్తున్న డ్రగ్స్ కేసులు భాగ్యనగరానికి మాయని మచ్చగా పరిణమిస్తున్నాయి.

    బార్​లు Bars, పబ్​లు pubs, రెస్టారెంట్​లు restaurants, ప్రైవేటు యూనివర్సిటీలు universities.. ఇలా ఎక్కడ చూసినా డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా ఉంటోంది.

    బోయిన్‌పల్లి Boinpally లోని మేధా స్కూల్‌ Medha School లో డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ డ్రగ్స్ తయారు చేస్తూ పట్టుబడ్డాడు. పోలీసులు రైడ్​ చేయగా 7 కిలోల డ్రగ్స్ దొరికింది. దీంతోపాటు రూ.20 లక్షల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    రూం నంబరు 6 తో పాటు మరో రెండు గదుల్లో డ్రగ్స్ Drug తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ గదులను డైరెక్టర్​ ఎప్పుడు కూడా మూసి ఉంచేవాడని విచారణలో తేలింది.

    130 మంది పిల్లలు ఉండే పాఠశాలలో గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేయడం స్థానికులను షాక్​కు గురిచేసింది. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

    పాఠశాలలోని కెమిస్ట్రీ ల్యాబ్‌లో 8 రియాక్టర్లు, 8 డ్రైయర్లు పెట్టి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం నుంచి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేసే సదరు డైరెక్టర్​ / ప్రిన్సిపల్​.. తాను తయారు చేసిన ప్రొడక్ట్​ను. ఆదివారం డెలివరీ చేసేవాడు.

    Medha School drug case | నిందితుల అరెస్టు..

    మేధా స్కూల్​ డ్రగ్స్ తయారీ కేసులో ప్రధాన సూత్రధారి జయప్రకాష్‌తో పాటు.. ఉదయ్, సాయి, మురళిని  పోలీసులు కోర్టు ఎదుట హాజరు పర్చి రిమాండుకు తరలించారు.

    గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి జయప్రకాష్‌ గౌడ్ ఫార్ములా కొని అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది. కాగా, గురువారెడ్డి పరారీలో ఉన్నాడు. అతగాడి కోసం ఈగల్ టీమ్ గాలిస్తోంది.

    బోయిన్‌పల్లిలోని మేధా పాఠశాలను అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు. మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

    కాగా, బోయిన్‌పల్లి మేధా స్కూల్‌కు తల్లిదండ్రులు చేరుకున్నారు. స్కూల్‌ సీజ్‌ చేయడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

    ఎగ్జామ్‌ ఉందని నిన్న మెసేజ్‌ వచ్చిందని పేరెంట్స్ తెలిపారు. అందుకే పిల్లలను స్కూల్‌కు తీసుకొచ్చామని పేర్కొన్నారు. స్కూల్‌ సీజ్‌ చేసిన విషయం తమకు తెలియదని తల్లిదండ్రులు వాపోయారు.

    More like this

    Anganwadi Teachers | అంగన్​వాడీ కార్యకర్తల ముందస్తు అరెస్ట్​

    అక్షరటుడే, భీమ్​గల్: Anganwadi Teachers | నియోజకవర్గంలోని ఆయా మండల పరిధిలో అంగన్​వాడీ కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు....

    Hyderabad Floods | మంచం కోసం వెళ్లి నాలాలో కొట్టుకుపోయారు : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Floods | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించిన విషయం...

    RRB Notification | నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఆర్‌ఆర్‌బీనుంచి జాబ్‌ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RRB Notification | భారత రైల్వేలో ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్నవారికి రైల్వే రిక్రూట్‌మెంట్‌...