అక్షరటుడే, వెబ్‌డెస్క్: గ్లోబల్ మార్కెట్లు (Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత సెషన్‌లో యూఎస్, యూరోపియన్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. సోమవారం ఉదయం చైనా, తైవాన్ మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) సైతం నెగెటివ్‌గా ఉంది.
Gift nifty | యూఎస్ మార్కెట్లు..
ఈవారం మధ్యలో నిర్వహించే ఎఫ్‌వోఎంసీ(FOMC) మీటింగ్‌పై ఇన్వెస్టర్ల దృష్టి కేంద్రీకృతమై ఉంది. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గత సెషన్‌లో నాస్‌డాక్ 0.44 శాతం లాభపడగా.. ఎస్‌అండ్‌పీ(S&P) 0.05 శాతం నష్టపోయింది. డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం లాభంతో సాగుతోంది.
Gift nifty | యూరోప్ మార్కెట్లు..
సీఏసీ 0.02 శాతం లాభంతో ముగియగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.15 శాతం, డీఏఎక్స్ 0.02 శాతం నష్టపోయాయి.
Gift nifty | ఆసియా మార్కెట్లు..
ఆసియా మార్కెట్లు శుక్రవారం ఉదయం మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 8 గంటల సమయంలో నిక్కీ(Nikkei) 0.88 శాతం, హాంగ్‌సెంగ్ 0.43 శాతం, కోస్పీ 0.33 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.05 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.48 శాతం, షాంఘై 0.18 శాతం నష్టంతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.15 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్ డౌన్(Gap down)లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Gift nifty | గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు గత సెషన్‌లో నికరంగా రూ. 129 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. డీఐఐలు వరుసగా పద్నాలుగో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. ,556 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.17 నుంచి 1.29 కు పెరిగింది. విక్స్(VIX) 2.29 శాతం తగ్గి 10.12 వద్ద ఉంది. పీసీఆర్ పెరగడం, విక్స్ తగ్గడం బుల్స్‌కు అనుకూలాంశం.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.54 శాతం పెరిగి 67.27 డాలర్ల వద్ద ఉంది.
డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 34 పైసలు బలపడి 88.27 వద్ద నిలిచింది. - యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.07 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 97.65 వద్ద కొనసాగుతున్నాయి.
- ఈ వారంలో పలు కీలకాంశాలున్నాయి. యూఎస్ ఎఫ్‌వోఎంసీ మీటింగ్‌తోపాటు భారత్ – యూఎస్ మధ్య ట్రేడ్ డీల్‌పై పురోగతిపై ఇన్వెస్టర్ల దృష్టి కేంద్రీకృతమై ఉంది.
- మన దేశానికి సంబంధించి ఆగస్టు నెల డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ (WPI inflation), నిరుద్యోగ రేటు, వాణిజ్య సమతుల్య సమతుల్య సంఖ్యలను ఈరోజు ప్రకటిస్తారు. సెప్టెంబర్ 12తో ముగిసిన వారానికి సంబంధించిన విదేశీ మారక నిల్వల సమాచారం ఈనెల 19న వెల్లడి కానుంది. దీంతోపాటు భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలలో పురోగతి సాధిస్తే పెట్టుబడిదారులలో విశ్వాసం పెరిగే అవకాశాలున్నాయి.