More
    Homeజిల్లాలుహైదరాబాద్Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో భారీ వర్షం.. గోడ కూలిపోయి మరో ఇద్దరి...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో భారీ వర్షం.. గోడ కూలిపోయి మరో ఇద్దరి దుర్మరణం.. నాలాలో కొట్టుకుపోయి ఇద్దరి గల్లంతు..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad | భాగ్యనగరంలో భారీ వర్షం దంచికొట్టింది. ఆదివారం (సెప్టెంబరు 14) సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయి కుంభవృష్టి కురిసింది.

    భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మియాపూర్, కూకట్‌పల్లి, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, హైటెక్‌ సిటీ, అమీర్‌పేట్‌ Ameerpet, పంజాగుట్టలో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గండమైసమ్మలో వర్షం ఇంకా దంచికొడుతోంది.

    కుషాయిగూడ, కాప్రా, ఏఎస్‌రావు నగర్‌, చర్లపల్లి, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, లాలాపేట్, తార్నాక, నల్లకుంట, అంబర్‌పేట, కాచిగూడ, ఉప్పల్‌, టోలీచౌకి, శేరిలింగంపల్లి, హైటెక్ సిటీ Hi-Tech City లో భారీగా ట్రాఫిక్‌జామ్ Heavy traffic jams అయింది.

    బోడుప్పల్‌, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, బషీర్‌బాగ్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, ఎంజే మార్కెట్‌, బేగం బజార్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌ నగర్‌, అబ్దుల్లాపూర్‌ మెట్‌, మణికొండ, గచ్చిబౌలిలోనూ భారీ వర్షం కురిసింది.

    Heavy rain in Hyderabad | 12 సెం.మీ. వర్షపాతం..

    హైదరాబాద్‌ Hyderabad లో గంటల వ్యవధిలో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. దోమలగూడ, చిక్కడపల్లి, గాంధీనగర్‌లో కాలనీలు నీటమునిగాయి.

    Heavy rain in Hyderabad | విషాదం నింపిన భారీ వర్షం..

    ఆసిఫ్‌నగర్‌ అఫ్జల్‌సాగర్‌లోని మంగారుబస్తీలో ఇద్దరు గల్లంతయ్యారు. అఫ్జల్‌సాగర్‌ నాలాలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. నాలాలో కొట్టుకుపోయిన మామ, అల్లుడి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అఫ్జల్‌సాగర్‌ నాలాను దాటే క్రమంలో వీరు అందులో పడిపోయారు.

    More like this

    India vs Pakistan Match | ఆసియా కప్​లో భారత్ విజయభేరి.. చిత్తుగా ఓడిన పాక్​..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India vs Pakistan Match : దుబాయ్​ Dubai వేదికగా ఆసియా కప్ Asia cup...

    Padmasali Hostel | పద్మశాలి వసతి గృహం అధ్యక్షుడిగా దీకొండ యాదగిరి ఘన విజయం

    అక్షరటుడే, ఇందూరు: Padmasali Hostel | నిజామాబాదు Nizamabad నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతి గృహం‌ Hostel  అధ్యక్షుడిగా...

    PD Act case | నిరుద్యోగులకు విదేశాల్లో కొలువుల పేరిట వల.. సైబర్​ మోసాలకై ఒత్తిడి.. నిందితుడిపై పీడీ యాక్టు కేసు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PD Act case | విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వల వేస్తారు.. అక్కడికి పంపించాక...