అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PD Act case | విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వల వేస్తారు.. అక్కడికి పంపించాక సైబర్ మోసాల cyber frauds కు పాల్పడాలంటూ ఒత్తిడి చేస్తారు..
ఇలాంటి అంతర్జాతీయ international ముఠాలతో సంబంధాలు పెట్టుకుని స్థానిక యువతను మోసం చేస్తున్న ఏజెంట్‌ను నిజామాబాద్ పోలీసులు ఎట్టకేలకే అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్టు కేసు నమోదు చేసి చంచలగూడ జైలు Chanchalaguda jail కు తరలించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. కమిషనరేట్ పరిధిలోని కొంత మంది నిరుద్యోగ యువతకు కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలేవాడు హైదరాబాద్ Hyderabad లోని సుచిత్ర Suchitra ప్రాంతానికి చెందిన కోలనాటి నాగశివ.
లావోస్, థాయిలాండ్ దేశాలకు యువకులను పంపించేవాడు. విదేశాల్లో యువత పాసుపోర్టులు లాగేసుకునేవారు అక్కడి వారు. వారిని సైబర్ నేరాలకు పాల్పడేలా బలవంతం చేసేవారు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిజామాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు నాగశివను అరెస్టు చేశారు. అతడిపై పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. నిందితుడిని చంచలగూడ జైలుకు తరలించారు.
PD Act case | సీపీ ఏమన్నారంటే..
ఈ ముఠా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని సీపీ సాయి చైతన్య CP Sai Chaitanya తెలిపారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారుడు కోలనాటి నాగశివపై పీడీ యాక్టు –1986 తెలంగాణ (ప్రివెన్షన్ డిటెన్షన్)ను ప్రయోగించినట్లు పేర్కొన్నారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు వివరించారు.